Sri. Nandamuri Balakrishna (TDP)

శ్రీ నందమూరి బాలకృష్ణ 

ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ,
హిందూపూర్  నియోజక వర్గం.,
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
 పుట్టిన తేదీ : జూన్ 10, 1960
పుట్టిన ప్రాంతం : చెన్నై (మద్రాస్) తమిళనాడు.
తండ్రి : నందమూరి తారక రామారావు
తల్లి : శ్రీమతి బసవతారకం
విద్యార్హతలు : బిఏ. (నిజాం కాలేజ్),
భార్యపేరు : శ్రీమతి వసుంధరా దేవి.
పిల్లలు : 3 (ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు)
వృత్తి : సినీ నటుడు.
ప్రవృత్తి : సోషల్ సర్వీస్
అడ్రస్ :
293/82/A 1355, రోడ్ నెంబర్ 1, జూబ్లీహిల్స్,
హైదరాబాద్.
ప్రస్తుత చిరునామా:
293/82/A 1355, రోడ్ నెంబర్ 1, జూబ్లీహిల్స్,
హైదరాబాద్.
ఫోన్ నెంబర్ : 9704400123; 04023607609
సోషల్ మీడియా :
ఇమెయిల్ : nbk@gmx.us
 
ట్విట్టర్ : https://twitter.com/manabalayya?lang=en
 
బాలకృష్ణ గురించి : 
తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధినేత శ్రీ నందమూరి తారకరామారావు గారి ఆరొవ కుమారుడు నందమూరి బాలకృష్ణ.  తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ, రాజకీయాలకు చాలా కాలం దూరంగా ఉన్నారు.  ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనకపోయినా.. గతంలో ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించారు. అయితే, ఇంటి చుట్టూ.. రాజకీయ వాతావరణం ఉండటంతో.. రాజకీయాలు ఒంటబట్టాయి.  బాలకృష్ణను పలుమార్లు రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకున్నా దూరంగా ఉన్నారు.  అయితే, 2014 బాలకృష్ణ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి హిందూపూర్ నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి.. విజయం సాధించారు.  ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు.  వీలు చిక్కినప్పుడల్లా తన నియోజక వర్గంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.  
 
పర్సనల్ కెరీర్ : 
 
సినీ గ్లామర్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన బాలకృష్ణ చిన్నతనంలో తండ్రి ఎన్టీఆర్ తో కలిసి తాతమ్మ కల చిత్రంలో బాలనటుడిగా నటించారు.  1981 లో బాలకృష్ణ హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ నుంచి బిఏ పూర్తిచేశారు.  ఇక తన 22 వ సంవత్సరంలో ఎస్ఆర్ఎంటి అధినేత కూతురైన వసుంధరా దేవిని వివాహం చేసుకున్నారు.  వీరికి ముగ్గురు పిల్లలు.  ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.  పెద్ద కుమార్తెను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేతైనా చంద్రబాబు నాయుడు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు.  
 
బాలకృష్ణకు జాతకాలపైన నమ్మకం ఎక్కువ.  చెప్పిన పనిని చెప్పిన సమయానికి చేసే మనస్తత్వం బాలకృష్ణది.  సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచినందుకు ఆయన పలు అవార్డులను అందుకున్నారు.  బాలకృష్ణకు మాస్ ఇమేజ్ ఎక్కువ.  
 
2004 మార్చి 3 వ తేదీన బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే.  బాలకృష్ణ తన భార్యకు చెందిన లైసెన్స్డ్ గన్ తో నిర్మాత బి సురేష్, సత్యన్నారాయణ చౌదరిపై ఫైర్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.  బాలకృష్ణపై కేసు పైన నమోదయింది. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.  
బాలకృష్ణ తన తల్లి పేరుమీద నిర్మించిన బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చైర్మన్ గా ఉన్నారు.  బసవతారకం ట్రస్ట్ పేరుతో పేదలకు వైద్యసేవలు అందిస్తున్నారు.   బాలకృష్ణ ఎన్టీఆర్ ట్రస్ట్ లో సభ్యులు కూడా.  
 
పొలిటికల్ కెరీర్ : 
 
1983 వ సంవత్సరంలో తెలుగువారి ఆత్మగౌరవం కోసం సినీనటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.  పార్టీని స్థాపించిన దగ్గరి నుంచి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు.  కానీ ఎప్పుడు ప్రత్యక్షంగా పోటీ చేయలేదు.  
 
2014 కు ముందు రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల కారణంగా బాలకృష్ణ రాజకీయాల్లోకి రాకతప్పలేదు.  
 
2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని హిందూపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  
హిందూపూర్ నియోజక వర్గం కోసం ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.  రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి నిధులను తెప్పించి పట్టణాభివృద్ధి కోసం వాటిని ఖర్చుచేయడం విశేషం.    
 
 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s