Shri Kiren Rijiju (BJP)

శ్రీ కిరెన్ రిజిజు
ఎంపీ., భారతీయ జనతాపార్టీ,
అరుణాచల్ వెస్ట్,
అరుణాచల్ ప్రదేశ్.
పుట్టిన తేదీ : నవంబర్ 19, 1971
పుట్టిన ప్రాంతం : నెఫ్రా డిస్ట్రిక్ట్, వెస్ట్ కమింగ్ (అరుణాచల్ ప్రదేశ్)
విద్యార్హతలు : బిఏ, ఎల్ఎల్బి.
భార్య పేరు : శ్రీమతి జోరం రీనా రిజిజు
పిల్లలు  : 5 (ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు)
అడ్రస్ : నఖు విలేజ్ & పోస్ట్,
నెఫ్రా డిస్ట్రిక్ట్, వెస్ట్ కమింగ్,
అరుణాచల్ ప్రదేశ్ -790001.
ప్రస్తుత చిరునామా :
9, కె.ఎం. మార్గ్,
న్యూఢిల్లీ – 110 011.
ఫోన్ నెంబర్ : Tel : (011) 26878120, 09818221114 (M)
వెబ్ సైట్ :
ఈమెయిల్ : krijiju@gmail.com
సోషల్ మీడియా :
పేస్ బుక్ : https://www.facebook.com/KirenRijiju/
ట్విట్టర్ : https://twitter.com/KirenRijiju
కిరెన్ రిజిజు గురించి :
కిరెన్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన నాయకుడు.  నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి వచ్చిన బలమైన నాయకులలో కిరెన్ ఒకరు.  భారతీయ జనతా పార్టీలో ముఖ్యమైన వ్యక్తుల్లో కిరెన్ ఒకరిగా నిలిచారు.  చిన్న వయసునుంచే కిరెన్ రాజకీయాల పట్ల మక్కువ.  డిబేటింగ్ లో మేటి.  బెస్ట్ యంగ్ ఎంపీగా పలు ఇంగ్లీష్ పత్రికలు పేర్కొన్నాయి. నార్త్ ఈస్ట్ ఇండియా సమస్యల గురించి పార్లమెంట్ లో ప్రస్తావించారు.  2014 లో మోడీ నాయకత్వంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక.. కిరెన్ రిజిజు కు మరింత ప్రాధాన్యత లభించింది.  కిరెన్ ప్రతిభను గుర్తించిన మోడీ తన కేబినెట్ లో మంత్రిగా తీసుకున్నారు.  ప్రసుత్తం కిరెన్ కేంద్ర హోంశాఖ సాహాయమంత్రిగా ఉన్నారు.
పర్సనల్ లైఫ్ :
నవంబర్ 19, 1971లో అరుణాచల్ ప్రదేశ్ లోని నెఫ్రా జిల్లాలో జన్మించారు.  కిరెన్ తండ్రి రించిన్ కరు.   రించిన్ కరు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ప్రో టర్మ్ స్పీకర్ గా పనిచేశారు.  తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో కిరెన్ చిన్నతనం నుంచి రాజకీయాలను దగ్గరి నుంచి చూశారు.  విద్యార్థిగా ఉన్నప్పుడు తోటి విద్యార్థులతో కలిసి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  1987లో రష్యాలో జరిగిన యూత్ అండ్ కల్చరల్ కార్యక్రమంలో సభ్యుడిగా ఉన్నారు.  కిరెన్ మంచి  క్రీడాకారుడు కూడా.  కిరెన్ ఏప్రిల్ 9, 2004 లో జోరం రీనా రిజిజు తో వివాహం జరిగింది.  జోరం విద్యావంతురాలు.  అరుణాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
పొలిటికల్ కెరీర్ :
2000-2005 వరకు ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ లో సభ్యుడిగా ఉన్నారు.
2004 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిరెన్ అరుణాచల్ ఈస్ట్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఇంధన మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీలో మెంబర్ గా పనిచేశారు
గిరిజన వ్యవహారాలు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యుడు.
మే 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అరుణాచల్ ఈస్ట్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి గెలుపొందారు.
2009 లో జరిగిన ఎన్నికల్లో ఆయనపై వచ్చిన అనేక ఆరోపణల కారణంగా కొద్దీ తేడాతో పరాజయం పాలయ్యారు.
ఇక, మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక, కేంద్రం ఆయనకు కీలకమైన బాధ్యతలకు అప్పగించింది. కిరెన్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా నియమించింది.  దూకుడు మనస్తత్వం కలిగిన కిరెన్ తన బాధ్యతలను అంతే దూకుడుగా నిర్వహిస్తున్నారు.
2004 లో బెస్ట్ యంగ్ పార్లమెంటేరియన్ అవార్డును సొంతం చేసుకున్నారు.
నేషనల్ ఆర్చరీ అసోసియేషన్ అఫ్ ఇండియా కు వైస్ ప్రెసిడెంట్ గా కిరెన్ పనిచేశారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s