Shri R Krishnaiah (MLA)

శ్రీ ర్యాగ కృష్ణయ్య .,
ఎమ్మెల్యే., తెలుగుదేశం పార్టీ.,
లాల్ బహదూర్ నగర్ నియోజక వర్గం.,
హైదరాబాద్.
పుట్టిన తేదీ : జనవరి 13, 1954
పుట్టిన ప్రాంతం : రాళ్ళ గుడిపల్లి, ఆర్ ఆర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ.
విద్యార్హతలు : ఎంఏ., ఎల్ఎల్ఎం., ఎంఫిల్.
భార్య పేరు : షాబ్రి దేవి.
పిల్లలు వారి వివారాలు : ఇద్దరు.  కుమారుడు రుషి అరుణ్ (ఎంబిబిఎస్) కూమార్తె రాణి శ్వేతాదేవి (బిటెక్).
అడ్రస్ : ఆర్/ఓ నెంబర్ : 1-9-669/43/A, విద్యానగర్, హైదరాబాద్ -500044.
తెలంగాణ.
ఫోన్ నెంబర్ : 90000091649866699155; 04027641710
వెబ్ సైట్ : –
ఈమెయిల్ :
సోషల్ మీడియా :
ట్విట్టర్ : https://twitter.com/ryagakrishnaiah
కృష్ణయ్య గురించి :
గత 35 సంవత్సరాల నుంచి కృష్ణయ్య వెనకబడిన కులాల ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు.  బిసిలకు రాజకీయాల్లో, చదువులోనూ, న్యాయపరమైన విషయాల్లోనూ రిజర్వేషన్ కావాలని ఆయన పోరాటం చేస్తున్నారు.  కృష్ణయ్య పోరాటం ఫలితంగా ఇప్పటికే వారికి ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించింది.  ఇక రిజర్వేషన్ సరిగా అమలు జరిపే విషయంలో సైతం ఆయన పోరాటం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికడుతూ ఆయన అనేకమార్లు పోరాటం చేశారు.  బిసిల్లో ఆదాయం తక్కువగా ఉన్న విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన చేసిన పోరాటం మరువలేనిది.  కృష్ణయ్య బ్యాంక్ పరీక్షల్లో టాపర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.  ఉద్యోగం మాత్రం చేయలేదు.  కృష్ణయ్య ప్రతిభను గురించిన పార్టీలు ఆయనకు రాజ్యసభ సీటును ఇవ్వాలని చూసినా.. అందుకు ఆయన సమ్మతించకపోవడం విశేషం.
పర్సనల్ లైఫ్ :
కృష్ణయ్య రంగారెడ్డి జిల్లాలోని రాళ్లగుడిపల్లి గ్రామంలో జనవరి 13, 1954 వ సంవత్సరంలో జన్మించారు.  కృష్ణయ్య కుటుంబం రైతు కుటుంబం.  వ్యవసాయం జీవనాధారం. కృష్ణయ్య చిన్నతనంలో ఉండగానే తల్లిదండ్రులను కోల్పోయారు.  చదువే జీవితాన్ని మారుస్తుంది అని నమ్మిన కృష్ణయ్య చదువుకు ప్రాధాన్యత ఇచ్చారు.  విద్యార్థిదశలో ఉండగా.. తోటి విద్యార్థుల కష్టాలను స్వయంగా చూసిన కృష్ణయ్య.. వారికోసం పోరాటం చేయడం అక్కడినుంచే మొదలుపెట్టారు.  1972 వ సంవత్సరంలో కృష్ణయ్య హాస్టల్ విద్యార్థుల నాయకుడిగా ఎంపికయ్యారు.  1973 నుంచి 1989 వరకు నాయకుడిగా కొనసాగారు.  తన హాస్టల్ గదినే ఆఫీస్ రూమ్ గా చేసుకున్నారు.  విద్యార్థుల సమస్యలపై ఆ సమయంలో అలుపెరగని పోరాటం చేశారు.  1976 ల్లో చేసిన పోరాటం ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 500 కొత్త హాస్టల్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఇక ప్రవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో వెనకబడిన కులాల విద్యార్థులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేశారు.  1996లో మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేయగా.. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 20% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించారు.
1989 నుంచి 1993 వరకు కృష్ణయ్య గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వెనకబడిన తరగతుల వారికీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేయగా ప్రభుత్వం వారికి 43% రిజర్వేషన్ కల్పించింది.
1990లో మండల కమీషన్ తన రిపోర్ట్ పొర్కొన్న విషయాలను అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలను అందజేశారు.  కృష్ణయ్య వెనకబడిన తరగతుల కోసం చేసిన 35 సంవత్సరాల పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 2000 జీవోలను విడుదల చేసింది.  దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు కృష్ణయ్య ఎలాంటి వ్యక్తో.
పొలిటికల్ కెరీర్ :
క్రిష్ణయ్య రాజకీయంగా ఎదగాలని ఎప్పుడు కోరుకోలేదు.  ప్రజల తరపున ఆయన పోరాటం చేశారు.  ముఖ్యంగా వెనకబడిన తరగతుల వారికోసం ఆయన 35 సంవత్సరాలపాటు పోరాటం చేశారు. ఇప్పటికి చేస్తూనే ఉన్నారు.  గతంలో అనేక రాజకీయ పార్టీలు కృష్ణయ్యకు పదవులను ఇస్తామని వచ్చినా.. అందుకు ఆయన అంగీకరించలేదు.
అయితే, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ తరపున తెలంగాణలోని ఎల్బీ నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు.  తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన తరువాత రాష్ట్రంలో బలంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై ఆర్ కృష్ణయ్య 12,525 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది.  టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది.  ఆ హామీలు నెరవేర్చడంలో విఫలం కావడంతో.. కృష్ణయ్య ప్రస్తుతం దానిపై దృష్టి పెట్టారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s