Dr Akula Satyanarayana

డాక్టర్ ఆకుల సత్యన్నారాయణ 

ఎమ్మెల్యే. భారతీయ జనతా పార్టీ.,

రాజమండ్రి నియోజక వర్గం.

పుట్టిన తేదీ :  జులై 8, 1963
పుట్టిన ప్రాంతం : రాజమండ్రి
విద్యార్హతలు : ఎంబిబిఎస్, ఎంఎస్.,
భార్య పేరు : శ్రీమతి ఏ. లక్ష్మి పద్మావతి
పిల్లలు వారి వివారాలు :
అడ్రస్ :
82-18-2/3, ఏవిఏ రోడ్, శారదా నగర్,
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
ఫోన్ నెంబర్ : 9866585553
వెబ్ సైట్ :
ఈమెయిల్ : asn.akula@gmail.com
సోషల్ మీడియా :
ట్విట్టర్ : https://twitter.com/DrAkulaMLA
నాయకుడి గురించి :
ఆకుల సత్యన్నారాయణ స్వతహాగా డాక్టర్. రాజమండ్రి వాస్తవ్యుడైన సత్యన్నారాయణ ఆర్ఎస్ఎస్ లో కొంతకాలం పనిచేశారు.  డాక్టర్ వృత్తి చేస్తూనే.. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.  2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున సత్యన్నారాయణ రాజమండ్రి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ ను ఎమ్మెల్యే ఆకులా తన నియోజక వర్గంలో విజయవంతం చేసే ప్రయత్నంలో అనేక కార్యక్రమాలు రూపొందించారు. 500, 1000 నోట్ల రద్దు తరువాత రాజమండ్రిలోని వ్యాపారులతో చర్చలు జరిగి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి  వివరించారు.  అవినీతిపై మోడీ తీసుకున్న నిర్ణయాలను, విధి విధానాలను వారికి తెలియజేసి… ప్రజల సహకారం కోరారు.  అవినీతికి దూరంగా ఉండే ఆకులను ప్రజలు అక్కున చేర్చుకున్నారు.
పర్సనల్ లైఫ్ :
ఆకుల గోపాల రావు కుమారుడైన ఆకుల సత్యన్నారాయణ జులై 8, 1963లో జన్మించారు.  విద్యాబ్యాసం రాజమండ్రిలో పూర్తి చేశారు.  ఎంబిబిఎస్ విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశారు.  ఆర్థో విశ్వవిద్యాలయంలో ఎంఎస్ విద్యను 1992 లో పూర్తి చేశారు.  రాజమండ్రిలో వైద్యునిగా విధులు నిర్వహిస్తూ.. రాజకీయాలవైపు అడుగులు వేశారు.  ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత.. తన వద్దకు వచ్చిన ప్రజల కష్టాలను తీర్చడంలో ఆయన బిజీ అయ్యారు.  రాజమండ్రిలోని 43 వ డివిజన్ లో నివశించే 2 సంవత్సరాల చిన్నారి ఆపరేషన్ కోసం వెంటనే సిఎం ఫండ్ నుంచి 5 లక్షలు తెప్పించి మరో 2 లక్షలు కలిపి మొత్తం 7 లక్షల రూపాయలతో చిన్నారికి ఆపరేషన్ చేయించారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన రాజమండ్రిలో నిర్వహించారు.
పొలిటికల్ కెరీర్ :
ఆకుల సత్యన్నారాయణ చదువుకునే రోజుల నుంచి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది.  ప్రచారక్ గా పనిచేస్తున్న సమయంలో అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.   చదువు పూర్తికాగానే బీజేపీ నుంచి ఆహ్వానం రావడంతో పార్టీలో చేరారు.  రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గానికి ఆయన ఇన్ ఛార్జ్ గా పనిచేశారు.
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది.  ఈ పొత్తులో భాగంగా రాజమండ్రి ఎమ్మెల్యే సీటు బీజేపీకి కేటాయించింది.  అయితే, బీజేపీ నుంచి ఎమ్మెల్యే సీటు కోసం సోము వీర్రాజు, ఆకుల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది.  అయితే, ఆర్ఎస్ఎస్ నుంచి ఆకుల సత్యన్నారాయణకు సపోర్ట్ ఉండటంతో.. పార్టీ ఆకులకు సీటు ఇచ్చింది.  2014 ఎన్నికల్లో ఆయన వైకాపా నేతపై 26,377 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  2014 ఎన్నికల్లో రాజమండ్రిలో 68.94% ఓటింగ్ జరిగింది.  గతంతో పోల్చుకుంటే 3% ఎక్కువ.
ప్రజలకు ఉపయోగపడే పధకాలను ప్రజలోకి తీసుకెళ్లడంలో డాక్టర్ ఆకుల ముందు వరసలో ఉన్నారు.  స్వచ్ఛభారత్, మహిళా పధకాలు, ఇలా ఎన్నింటినో ఆయన ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేశారు.   అవసరమైతే అధికారులు, ఇటు ప్రజలకు కూడా క్లాస్ తీసుకునేందుకు ఆయన వెనకాడలేదు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s