Yogi Adityanath

యోగి ఆదిత్యనాధ్., ఎంపీ, గోరక్ పూర్,

భారతీయ జనతాపార్టీ,

ఉత్తరాఖండ్.
తండ్రి పేరు : మహంత్ అవైధ్యనాథ్.
పుట్టిన తేదీ: జూన్ 5, 1972
పుట్టిన ప్రాంతం : పంచూర్, గర్హ్వాల్ (ఉత్తరాఖండ్)
విద్యార్హతలు : గ్రాడ్యుయేట్, హెచ్.ఎన్.బి. గర్హ్వాల్ విశ్వవిద్యాలయం, శ్రీనగర్, ఉత్తరాఖండ్.
వృత్తి : మత మిషనరీ, సోషల్ వర్కర్.
అడ్రస్ :
361, ఓల్డ్ గోరఖ్ పూర్, శ్రీ గోరఖ్నాథ్ మందిర్,
గోరఖ్ పూర్ –  273015, ఉత్తర్ ప్రదేశ్.
ప్రస్తుత చిరునామా :
19, జి.ఆర్.జి రోడ్,
న్యూఢిల్లీ – 110001.
ఫోన్ నెంబర్ :
Tel : (0551) 2255453/54, 09450966551 (M)
Fax : (0551) 2255455
సోషల్ మీడియా :
వెబ్ సైట్ : http://www.yogiadityanath.in/
ట్విట్టర్ : https://twitter.com/Yogi4UP
వికీపీడియా : యోగి ఆదిత్యనాథ్ 
యోగి ఆదిత్యనాథ్ గురించి :
యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన నేత.  యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ లో మహత్ మఠ్ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.  ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఈ నేత.. ఉత్తరప్రదేశ్ లో కీలమైన వ్యక్తి.  హిందూ సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆదిత్యనాథ్ చేస్తున్న కృషి అమోఘమైంది.  హిందూ యువ వాహిని సంస్థను నెలకొల్పారు.  ఈ సంస్థ గోవుల పరిరక్షణ బాధ్యతలను నిర్వహిస్తుంది.  హిందువుల వాణిని బలంగా వినిపించడంలో యోగి ఆదిత్యనాథ్ ది అందెవేసిన చేయి.
పర్సనల్ లైఫ్ :
యోగి ఆదిత్యనాథ్ జూన్ 5, 1972 వ సంవత్సరంలో పంచూర్ (ఉత్తరాఖండ్).. లో జన్మించారు.   డిగ్రీ వరకు చదువుకున్న యోగి.. గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ టెంపుల్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ 26 సంవత్సరాల వయసులోనే లోక్ సభకు ఎంపికయ్యారు.  మహంత్ అవైధ్యనాథ్ కాలం చేశాక, యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ బాధ్యతలను స్వీకరించారు.  ఇక ఇదిలా ఉంటె, యోగి ఆదిత్యనాథ్ యోగిక్ సత్కర్మ, హఠయోగ, స్వరూప్ ఈవెన్ సాధన, హిందూ రాష్ట్ర నేపాల్ వంటి పుస్తకాలను పబ్లిక్ చేశారు.   హిందీ వీక్లి కి చీఫ్ ఎడిటర్ గా, యోగ్ వాణి మ్యాగజైన్ కు చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్ధికంగా వెనకబడిన పిల్లల కోసం హాస్టల్స్ ను నడుపుతున్నారు.  పేద విద్యార్థుల కోసం విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు.  గ్రామీణ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ.. ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు.  యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు యోగి ఆదిత్యానాథ్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పొలిటికల్ కెరీర్ :
యోగి ఆదిత్యనాథ్ 26 వ సంవత్సరంలోనే రాజకీయాల్లోకి వచ్చారు.  చిన్నప్పటి నుంచి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ లో ప్రచారక్ గా పనిచేశారు.
1998 లో 12 వ లోక్ సభకు లోక్ సభ సభ్యుడిగా ఎంపికయ్యారు.
1998 -99 వరకు ఆహరం, పౌరసరఫాల శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
1999 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.
1999-2000 వరకు ఫుడ్, పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో మెంబర్ గా ఉన్నారు.
2000 వ సంవత్సరంలో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
2004 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ సభ్యుడిగా ఎంపికయ్యారు.
ప్రభుత్వ హామీలపై ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
2009 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 15 వ లోక్ సభకు గోరఖ్ పూర్ నుంచి ఎంపికయ్యారు.
ఆగస్టు 31, 2009 లో ట్రాన్స్పోర్ట్, టూరిజం మరియు కల్చర్ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
మే 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోరఖ్ పూర్ నుంచి విజయం సాధించారు. ఆగష్టు 14, 2014 నుంచి ఏప్రిల్ 30, 2015 వరకు పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీలో మెంబర్ గా పనిచేశారు.
సెప్టెంబర్ 1, 2014 నుంచి ట్రాన్స్పోర్ట్, టూరిజం మరియు కల్చరల్ స్టాండింగ్ కమిటీలో మెంబర్ గా ఉన్నారు.
సెప్టెంబర్ 2, 2014 నుంచి పార్లమెంట్ జాయింట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు.
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.  జనవరి 19, 2015 నుంచి జనరల్ పర్పస్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s