Shri. G. Kishan Reddy (BJP)

శ్రీ జి కిషన్ రెడ్డి 

ఎమ్మెల్యే., భారతీయ జనతా పార్టీ,
అంబర్ పెట్ నియోజక వర్గం.,
హైదరాబాద్.
పుట్టిన తేదీ : మే 15, 1964
పుట్టిన ప్రాంతం : తిమ్మాపూర్ గ్రామం, రంగారెడ్డి జిల్లా.
విద్యార్హతలు : బిఈ.
భార్య పేరు : కావ్య
పిల్లలు  :  2 (వైష్ణవి, తన్మయ్)
అడ్రస్ :
హౌస్ నెంబర్ : 3-4-4, లెజెండ్ శ్రీ లక్ష్మి అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ : 502,
భూమన్న గల్లీ,, కాచిగూడ స్టేషన్ రోడ్, బర్కత్ పుర, హైదరాబాద్., తెలంగాణ.
ప్రస్తుత చిరునామా : 
క్వార్టర్ నెంబర్ 205, ఎంఎస్ బ్లాక్ -II, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదర్ గూడా, హైదరాబాద్ – 500029. తెలంగాణ.
ఫోన్ నెంబర్ : 9949099997; 9490599997; 04027568188; 24653535
వెబ్ సైట్ : http://kishanreddy.com/
ఈమెయిల్ :
సోషల్ మీడియా : 
పేస్ బుక్ : https://www.facebook.com/gkishanreddy/
ట్విట్టర్ : https://twitter.com/kishanreddybjp
కిషన్ రెడ్డి గురించి : 
కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీలో కీలకమైన వ్యక్తి. కిషన్ రెడ్డి 1987 నుంచి భారతీయ జనతాపార్టీలో కొనసాగుతున్నారు.  పార్టీకోసం కిషన్ రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారు.  రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కిషన్ రెడ్డి చేస్తున్న కృషి అద్వితీయమైంది.  ప్రసుత్తం కిషన్ రెడ్డి భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు.
పర్సనల్ లైఫ్ : 
మే 15, 1964లో రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి.. డిప్లమా వరకు చదువుకున్నారు.  విద్యార్థి దశనుంచే కిషన్ రెడ్డి భారతీయ జనతాపార్టీలో ఉన్నారు. కిషన్ రెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.  రాజకీయాల్లో బిజీగా మారడంతో వ్యాపారాన్ని పక్కన పెట్టి పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తున్నారు.
పొలిటికల్ కెరీర్ : 
1987లో కిషన్ రెడ్డి యూత్ లీడర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.  యూత్ లీడర్ గా కిషన్ రెడ్డి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు.  ఆయనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన భారతీయ జనతాపార్టీ భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించింది.  2002 నుంచి 2005 వరకు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగారు.  2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
హిమాయత్ నగర్ నియోజక వర్గం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కిషన్ రెడ్డి నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
2009 & 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంబర్ పెట్ నియోజక వర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రాష్ట్ర అసెంబ్లీలో కొంతకాలం ఫ్లోర్ లీడర్ గా కూడా పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలకు అధ్యక్షుడిగా ఉన్నారు.  రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విభజన జరిగిన తరువాత కిషన్ రెడ్డి తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s