Dr. K. Haribabu (BJP

డాక్టర్ శ్రీ కంభంపాటి హరిబాబు.,

MP, Bharatiya Janatha Party,
Visakhapatnam Parliament Constituency,
Visakhapatnam,
Andhra Pradesh.
అడ్రస్ : 
ఫ్లాట్ నెంబర్ : సి -2, ఆస్పెన్ హైట్స్, దస్పల్లా హిల్స్, విశాఖపట్నం-530003,
ఆంధ్రప్రదేశ్.
ప్రస్తుత చిరునామా :
రూమ్ నెంబర్ : 1424, అశోక హోటల్, చాణక్యపురి,
న్యూఢిల్లీ – 110021.
ఫోన్ నెంబర్ : (0891) 2731783, 2553394,  09440901300
సోషల్ మీడియా : 
పేస్ బుక్ : https://www.facebook.com/HariBabuBJP/
ట్విట్టర్ : https://twitter.com/HariBabuBJP
వాట్సాప్ :

హరిబాబు గురించి : 

హరిబాబు 2014లో 16వ లోక్ సభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తరపున విశాఖపట్నం నుంచి పోటీచేసి విజయం సాధించారు.  వైకాపా నేత వైఎస్ విజయమ్మపై ఆయన గెలుపొందారు.  

బాల్యం : 

శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీమతి సీతమ్మ దంపతులకు 1953, జూన్ 15 వ తేదీన ప్రకాశం జిల్లాలోని చీరాలలో కంభంపాటి హరిబాబు జన్మించారు.  అయితే, బాల్యంలో చదువు చీరాల్లోనే సాగింది.  మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన హరిబాబు మొదటి నుంచి సౌమ్యగుణం కలిగిన వ్యక్తి.  చదువులో ముందుండేవారు.  

కెరీర్ :

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ చదివేందుకు విశాఖపట్నం వచ్చారు.  అక్కడే బిఈ, ఎంఈ (ఎలక్రానిక్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్), పీహెడీ (ఇంజనీరింగ్) పూర్తిచేశారు.  కొంతకాలంపాటు విశాఖలోనే ప్రొఫెసర్ గా పనిచేశారు.  

పొలిటికల్ కెరీర్ : 

1977 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని జనతా పార్టీకి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పనిచేశారు. 

1978 వ సంవత్సరంలో జనతా యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. 

1988 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీగా నియమింపబడ్డారు.

1991-1993 లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా పనిచేశారు.

1993 నుంచి 2003 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ గా పనిచేశారు.

1998 నుంచి 2005 వరకు ది మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవెలప్ మెంట్ అథారిటీ మెంబర్ గా పనిచేశారు.

1999 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులుగా ఉన్నారు.

2003 నుంచి 2004 వరకు నదుల అనుసంధానం కోసం భారత ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ లో సభ్యునిగా పనిచేశారు.

2003 లో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు.

2005 లో కంభంపాటి హరిబాబు గారు భారతీయ జనతాపార్టీ నేషనల్ సెక్రటరీగా నియమితులైనారు.

2013 లో జాతీయ క్రమశిక్షణా కమిటీ సభ్యునిగా పనిచేశారు.

మార్చి 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైనారు.  ప్రసుత్తం ఆయన అధ్యక్షుడిగానే కొనసాగుతున్నారు.

2014 మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికల్లో 16 వ లోక్ సభ సభ్యునిగా విశాఖపట్నం నుంచి గెలుపొందారు.

పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ సభ్యునిగా ఆగస్టు 14, 2014 లో నియమింపబడ్డారు.

సెప్టెంబర్ 1, 2014 న స్టాండింగ్ కమిటీ మెంబర్ గాను, నేషనల్ ప్లాట్ ఫామ్ ఫర్ డిసాస్టర్ రిస్క్ రిడక్షన్ మెంబర్ గాను కొనసాగుతున్నారు.

సెప్టెంబర్ 15, 2014 నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్ మెంట్ స్కీం లో సభ్యునిగా ఉన్నారు.

పర్సనల్ కెరీర్ :

1972 లో స్టూడెంట్ గా ఉన్న సమయంలో ఆయన జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు.  1972-73 మధ్యకాలంలో హరిబాబు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్ సెక్రటరీగా పనిచేసి నాయకుడిలా అనుభవం గడించారు.  1974-75 లో హరిబాబు లోకనాయక్ జయప్రకాష్ నారాయణన్ తలపెట్టిన లోక్ సంగ్రహ సమితి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.  ఎమర్జన్సీ సమయంలో హరిబాబు 6 నెలలపాటు జైలు జీవితం గడిపారు. ఇక హరిబాబుకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s