Mahant Shambhuprasadji Tundiya (BJP)

శంభు ప్రసాద్ తుండియా

MP, Rajyasabha, BJP,

Gujarat .

అడ్రస్ : 

సంత్ శ్రీ సావ్ గున్ సమాధిస్తాన్,
జంజార్క పోస్ట్, ఢంధూక జిల్లా,
అహ్మదాబాద్, గుజరాత్
ప్రస్తుత చిరునామా: 
135, సౌత్ అవెన్యూ, న్యూఢిల్లీ.
ఫోన్ నెంబర్ : (02712)222208, 09924222294
శంభు ప్రసాద్ తూండియా గురించి : 
సామాజిక సేవ పట్ల అమితమైన ఆసక్తి ఉన్న శంభుప్రసాద్ తూండియా, తన ప్రాంతంలో అనేక సేవ కార్యక్రమాలు చేపట్టారు.  ఒకవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూనే.. శంభుప్రసాద్ రాజకీయాలపై కూడా దృష్టి సారించారు.  భారతీయ జనతా పార్టీ తరపున శాసనసభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు.
బాల్యం : 
శ్రీ బాల్దేవ్ దాస్, శ్రీమతి సవితా బెన్ దంపతులకు నవంబర్ 14, 1970 వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రములోని జంజార్క లో  శంభుప్రసాద్ జన్మించారు.  అహ్మాదాబాద్ విశ్వ విద్యాలయం నుంచి బి. ఏ పట్టాపొందారు.
కెరీర్ : 
శ్రీ బాల్దేవ్ దాస్ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి.  ఆయన కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసేవారు.  శ్రీ బాల్దేవ్ కొంతకాలం వ్యవసాయం చేశారు.  రైతుల సమస్యలపై ఆయన పోరాటం కూడా చేశారు.
పొలిటికల్ కెరీర్ : 
భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయిలో చేసిన శంభుప్రసాద్ .. పార్టీ కోసం విశేషమైన కృషి చేశారు. శంభుప్రసాద్ సేవలకు మెచ్చిన పార్టీ.. 2007 లో దశదా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అనుమతి ఇచ్చింది.
2007 నుంచి 2012 వరకు శంభుప్రసాద్ తూండియా  దశదా నియోజకవర్గం శాసనసభ్యుడిగా పనిచేసారు.
2014 లో భారతీయ జనతాపార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది.  ప్రస్తుతం శంభుప్రసాద్ గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.  2020 ఆయన పదవీకాలం ముగుస్తుంది.

Leave a comment