Dr. Murali Manohar Joshi (BJP)

డాక్టర్ శ్రీ మురళి మనోహర్ జోషి,,

ఎంపీ, కాన్పూర్,
భారతీయ జనతాపార్టీ, ఉత్తరప్రదేశ్.
పుట్టిన తేదీ : జనవరి 5, 1934
పుట్టిన ప్రాంతం : నైనిటాల్
తండ్రి : లేట్ శ్రీ మన్మోహన్ జోషి
విద్యార్హతలు : ఎంఎస్సి, పి.హెచ్.డి
భార్య : తార్ల జోషి
పిల్లలు : ఇద్దరు.
వృత్తి : ప్రొఫెసర్ (రిటైర్డ్)
అడ్రస్ : 
అంగిరస్, 9/10A , టాగోర్ నగర్,
అనుకుల్ చంద్ర బనెర్జీ రోడ్,
అలహాబాద్ – 211001, ఉత్తరప్రదేశ్.
కేరాఫ్ : శ్రీ సుధీంద్ర జైన్,
113/233, స్వరూప్ నగర్,
కాన్పూర్ – 208002, ఉత్తర ప్రదేశ్.
ప్రసుత చిరునామా : 
6, రైసినా రోడ్, న్యూఢిల్లీ – 110001.
ఫోన్ నెంబర్స్ : Tel : (0532) 2465008 (0512) 2532110(0512) 2399555(011) 23718444, 23326080

Fax : (011) 23711772

 
సోషల్ మీడియా : 
 
ఇమెయిల్ : murali@sansad.nic.in 
 
 
ట్విట్టర్ : https://twitter.com/drmmjoshibjp
 
మురళీమనోహర్ జోషి గురించి : 
 
మురళీమనోహర్ జోషి దేశంలో పరిచయం అక్కరలేని పేరు.  నైనిటాల్ లో జన్మించిన జోషి ఉన్నత విద్యను అభ్యసించారు.  1948 నుంచే ఆయనకు రాజకీయాలతో పరిచయం ఉంది.  ఒకవైపు విద్యను అభ్యసిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో తనదైన పాత్రను పోషించారు.  జేపీ  మూమెంట్ లో పాల్గొని చురుకైన పాత్రను పోషించారు.  ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కూడా అయ్యారు.  1954 నుంచి 77 వరకు అఖిలభారత విద్యార్థి పరిషత్ తో అనుబంధం పెంచుకున్నారు.   సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీలో సభ్యులుగా కూడా ఆయన పనిచేశారు.  1977లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ లో మెంబర్ గా పనిచేశారు.  అదే సంవత్సరం నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అయ్యారు.  ఇప్పటి వరకు ఆరుసార్లు లోక్ సభ సభ్యులుగా గెలుపొందారు.  
 
పర్సనల్ లైఫ్ : 
 
1934 లో జన్మించిన జోషి ఎంఎస్సీ, పి.హెచ్.డి వరకు చదువుకున్నారు.  అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు.  అయితే రాజకీయాల్లోకి వచ్చాక ప్రొఫెసర్ వృత్తి ని పక్కన పెట్టవలసి వచ్చింది.  ప్రొఫెసర్ జోషి తన జీవితకాలంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు.  1999లో జవహర్ లాల్ నెహ్రు సైన్స్ అవార్డు, 2001 లో నేషనల్ సిటిజన్స్ అవార్డు, 2002 లో మంగోలియా ఫ్రెండ్షిప్ మెడల్, 2004 లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లైఫ్ టైమ్ అవార్డు, 2009లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు.  రాజకీయాల్లో విశేషమైన కృషి చేసినందుకు భారతప్రభుత్వం 2017 వ సంవత్సరానికి గాను మురళీమనోహర్ జోషికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. 
 
పొలిటికల్ కెరీర్ : 
 
1977లో అల్మోరా నియోజక వర్గంనుంచి జనతాపార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 
1977 నుంచి 1979 వరకు జనతాపార్టీ పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
1978-1980 వరకు రైల్వే యాక్సిడెంట్ ఎంక్వయిరీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.  1980 లో బీజేపీ ఫౌండర్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
1981 -1983 ట్రెజరర్ బీజేపీ
1986 -1990 బీజేపీ జనరల్ సెక్రటరీ
1991-1993 బీజేపీ ప్రెసిడెంట్
1992-1996 రాజ్యసభ ఎంపీ
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ మెంబర్
పేటెంట్ లా కమిటీ సభ్యులు
ట్రేడ్ మార్క్స్ బిల్ కమిటీ సభ్యులుగా పనిచేశారు.
1996 లో జరిగిన ఎన్నికల్లో జోషి అలహాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేసి విజయం సాధించారు.
మే 16, 1996 నుంచి జూన్ 1 1996 వరకు హోమ్ శాఖామంత్రిగా పనిచేశారు.
1996-1997 వరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు.
ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్ గా పనిచేశారు.
మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా పనిచేశారు.
1998 లో జరిగిన ఎన్నికల్లో అలహాబాద్ నియోజక వర్గం నుంచి ఆయన తిరిగి ఎంపీగా ఎంపికయ్యారు.
1998-1999 వరకు మానవ వనరుల శాఖామంత్రిగా పనిచేశారు.
1999 లో జరిగిన ఎన్నికల్లో జోషి అలహాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి మరోసారి విజయం సాధించారు.  వరసగా ఆయన మూడుసార్లు అలహాబాద్ నుంచి విజయం సాధించడం విశేషం.
అక్టోబర్ 13, 1999 నుంచి 21, మే 2004 వరకు కేంద్ర మానవ వనరుల శాఖామంత్రిగా పనిచేశారు.
జులై 2004 నుంచి మే 15, 2009 వరకు రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు.
ఆగస్టు 2004-2009 వరకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సంప్రదింపుల కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
మార్చి 10, 1006 లో ఇండియా – హుంగేరి పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.
మే 16, 2009 లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి పోటీ చేసి పార్లమెంట్ కు ఎంపికయ్యారు.
ఆగష్టు 7, 2009 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ మెంబర్ గా పనిచేశారు.
ఆగష్టు 31, 2009 -మే 5, 2010 వరకు ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు.
సెప్టెంబర్ 16, 2009 లో మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ సంప్రదింపుల కమిటీ లో సభ్యులుగా ఉన్నారు.
అక్టోబర్ 7, 2009 లో ఎథిక్స్ కమిటీ సభ్యులుగా పనిచేశారు.
అక్టోబర్ 19, 2009 లో సాధారణ అవసరాల కమిటీలో సభ్యులుగా పనిచేశారు.
జనవరి 31, 2010 లో గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ పార్లమెంటరీ ఫోరంలో సభ్యులుగా పనిచేశారు.
మే 1, 2010 లో పబ్లిక్స్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు.
జులై 20, 2010 లో ఇండియా – హంగేరి పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
డిసెంబర్ 7, 2011 లో ఇండియా – రష్యా ఫెడరేషన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ లో సభ్యులుగా ఉన్నారు.
మే 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మురళీమనోహర్ జోషి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఆగష్టు 14, 2014 నుంచి ఎస్టిమేట్ కమిటీ చైర్ పర్సన్ గా ఉన్నారు.
సెప్టెంబర్ 1, 2014 నుంచి డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు.
సెప్టెంబర్ 3, 2014 నుంచి మినిస్ట్రీ అఫ్ టెక్స్ట్ టైల్స్ సంప్రదింపుల కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
సెప్టెంబర్ 15, 2014 నుంచి లోక్ సభ బడ్జెట్ కమిటీలో సభ్యులు.
డిసెంబర్ 17, 2014 నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ కమిటీలో సభ్యులు.
జనవరి 29, 2015 నుంచి జనరల్ పర్పస్ కమిటీలో సభ్యులు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s