Smt. Bijoya Chakravarthy (BJP)

శ్రీమతి బిజోయా చక్రవర్తి

ఎంపీ., బాలిగాన్, అస్సాం.,

భారతీయ జనతాపార్టీ.

  • పుట్టిన తేదీ : 07 అక్టోబర్, 1939.
  • పుట్టిన ప్రాంతం : బలిగాన్, అస్సాం.
  • తండ్రి పేరు : లేట్ శ్రీ బి.కే. ఠాకూర్,
  • విద్యార్ధతలు : ఎంఏ (ఇంగ్లీష్) గౌహతి విశ్వవిద్యాలయం, గౌహతి, అస్సాం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి (ఉత్తరప్రదేశ్).
  • వృత్తి : విద్యావేత్త.
  • భర్త పేరు : శ్రీ జితేన్ చక్రవర్తి.

అడ్రస్ :

39, శ్రీనగర్ పత్, బై లైన్-1,

గౌహతి – 781005, అస్సాం.

ప్రస్తుత చిరునామా :

18, మాధవ్ రోడ్, న్యూఢిల్లీ – 110001.

 

 

ఫోన్ నెంబర్ :

Tel : (011) 237523420943501704809013180334 (M)
Fax : (011) 23752343

సోషల్ మీడియా : 

ఇమెయిల్ :

పేస్ బుక్ :https://www.facebook.com/bijoya.chakravarty

ట్విట్టర్ :

బిజోయా చక్రవర్తి గురించి : 

బిజోయా గౌహతికి చెందిన విద్యావేత్త.  ఎంఏ ఇంగ్లీష్ చేసిన బిజోయా మూడుసార్లు లోక్ సభకు ఎంపికయ్యారు.  విద్యావేత్తగా విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.  మామూలు నాయకురాలిగా ఉన్న బిజోయా చిన్న చిన్న చేపట్టి వాటిని సమర్ధవంతంగా నిర్వహించారు.  బిజోయా మూడు పుస్తకాలు కూడా వ్రాసారు.  నాజల్ ఫిరింగతి, అభిజన్ వంటి పుస్తకాలు రచించారు.

పర్సనల్ కెరీర్ : 
1939 లో గౌహతిలో జన్మించిన బిజోయా.. విద్యాధికురాలు.  విద్యార్థి దశలో ఉండగానే.. సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారు.  జూన్ 1, 1965 లో బిజోయా జితేన్ చక్రవర్తితో వివాహం జరిగింది.  వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.  బిజోయా కవితలు, షార్ట్ స్టోరీస్, నావెల్స్, వ్యాసాలు రాయడం అలవాటు.  ఆమె వివిధ మ్యాగజైన్స్ కు కవితలు, కథలు వ్రాసారు.  సోషల్ ఇష్యూస్ మీద అనేక వ్యాసాలు వ్రాసారు.  అంతేకాదు, అస్సాం రాజకీయాలపై ఆమె రాసిన వ్యాసాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  1964 నుంచి 1968 మధ్యలో అప్పటి రాజకీయాలపై దాదాపు 200 వ్యాసాలు వ్రాసారు.  గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేసిన కృషి అమోఘమైనది.  చదువుకునే రోజాల్లో 1955-59 మధ్యకాలంలో కాలేజీ తరపున క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించారు.  గౌహతి హెల్త్ క్లబ్, వీవర్క్స్ క్లబ్, కాన్స్టిట్యూషన్ క్లబ్, ఇండీజీనియస్ స్పోర్ట్స్ క్లబ్, బాయ్స్ క్లబ్ లో మెంబర్ గా ఉన్నారు.

పొలిటికల్ కెరీర్ : 

చదువుకునే రోజుల దగ్గరి నుంచి బిజోయా రాజకీయాలతో అనుబంధం ఉంది. 1965-77 వరకు ప్రజా సోషలిస్ట్ పార్టీలో పనిచేశారు.  1988 వరకు ఇంటర్నేషనల్ యూత్ హాస్టల్ అసోసియేషన్ అఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా పనిచేసారు.  బిజెపి ఆధ్వర్యంలోని కిసాన్ మోర్చాకు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.
1977-78 లో మంగలదై జనతాపార్టీ జిల్లా సెక్రటరీగా పనిచేశారు.
1986-92 వరకు రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.
1986-87 లో పర్యాటక శాఖ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో మెంబర్ గా ఉన్నారు.
1987 నుంచి 89 వరకు ఆహరం మరియు పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.
1988 నుంచి 1990 వరకు రాజ్యసభ ఏర్పాటు చేసిన రూల్స్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.
1990-1991 సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.
1991 నుంచి 1992 వరకు పెట్రోల్ మరియు సహజవాయు నిక్షేపాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.
1999 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అస్సాం నుంచి లోక్ సభ సభ్యురాలిగా ఎంపికయ్యారు.
అక్టోబర్ 13, 1999 లో కేంద్ర జలవనరుల శాఖామంత్రిగా పనిచేశారు.
2009 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజోయా అస్సాం నుంచి రెండోసారి లోక్ సభ సభ్యురాలిగా ఎంపికయ్యారు.
ఆగష్టు 31, 2009 లో సోషల్ జస్టిస్ మరియు ఎంపర్మెంట్ స్టాండింగ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.
ఏప్రిల్ 21, 2010 లో హౌస్ అఫ్ సిట్టింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
మే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అస్సాం నుంచి మూడోసారి లోక్ సభకు లోక్ సభసభ్యురాలిగా ఎంపికయ్యారు.
సెప్టెంబర్ 1, 2014 నుంచి మహిళా సాధికారికత కమిటీకి చైర్ పర్సన్ గా ఉన్నారు.  నార్త్ ఈస్ట్రన్ ప్రాంతం అభివృద్ధి కోసం ఏర్పాటు సంప్రదింపుల కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.
సెప్టెంబర్ 1, 2014 నుంచి అక్టోబర్ 18, 2016 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, పరిసరాలు & అడవులపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.
జనవరి 29, 2015 నుంచి సాధారణ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.
అక్టోబర్ 19, 2016 నుంచి ఆర్ధిక వ్యవహారాలపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s