Smt. Bodige Shobha (TRS)

శ్రీమతి బొడిగె శోభ

ఎమ్మెల్యే, టి.ఆర్.ఎస్ పార్టీ,
చొప్పదండి (ఎస్.సి) నియోజక వర్గం
కరీంనగర్ జిల్లా.,
తెలంగాణ.
  • పుట్టిన తేదీ : జూన్ 9, 1974
  • పుట్టిన ప్రాంతం : హన్మకొండ, వరంగల్
  • తల్లిదండ్రులు : సాతూరి భాగ్యలక్ష్మి, సాతూరి రత్నం
  • విద్యార్హతలు : ఇంటర్
  • భర్త : బొడిగె గాలన్న
  • సంతానం : ఇద్దరు (దివ్య, వికాస్)
  • వృత్తి : సామాజిక కార్యకర్త
అడ్రస్ : 
హౌస్ నెంబర్ : 8-6-329/2/బి, దివ్య భవన్, ఎన్టీఆర్ చౌక్,  కోటిరాంపూర్, కరీంనగర్ – 505001
ఫోన్ నెంబర్స్ : 9399948236,9959959288
సోషల్ మీడియా : 
బొడిగె శోభ గురించి :
విప్లవ సిద్ధాంతం నుంచి ప్రజాస్వామ్యం వైపు వచ్చిన నేత బొడిగె శోభ.  రాజకీయాల్లోకి రాకముందు శోభ విప్లవం బాటపట్టి అడవుల్లో పోరాటం చేశారు.  మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, మహిళలపై జరుగుతున్న హైయమైన చర్యల కారణంగా శోభ విప్లవాన్ని భుజానికి ఎత్తుకున్నారు.  అక్కడి నుంచి బయటకు వచ్చాక శోభ రాజకీయాల్లోకి వచ్చింది.  టి.ఆర్.ఎస్ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.  మహిళలు అన్నిరంగాల్లో రాణించగలరని నిరూపించారు.
పర్సనల్ లైఫ్ : 
1974లో హన్మకొండలో జన్మించిన శోభ ఇంటర్ వరకు చదువుకున్నారు.  చిన్న తనంలోనే పెళ్ళి కావడంతో చదువు ఇంటర్ తోనే ఆపేశారు.  శోభ భర్త బొడిగె గాలన్న సహకారంతో మహిళలపై జరుగుతున్న హింసాకాండ గురించి తెలుసుకున్నారు.  భర్త ద్వారా విప్లవ పార్టీవైపు అడుగులు వేశారు.  ఆ తరువాత కొంతకాలంపాటు ఆ పార్టీలోనే ఉన్నారు.  విప్లవ పార్టీలో ఉండగా బొడిగె శోభ మహిళా సమస్యలను ఎన్నింటినో పరిష్కరించగలిగింది.  అయితే, కొన్ని కారణాల వలన శోభ పార్టీ నుంచి బయటకు వచ్చారు.  వచ్చాక ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన రాజకీయ పార్టీలో చేరారు.
పొలిటికల్ కెరీర్ : 
  • 1990-1997 వరకు జనశక్తి విప్లవపార్టీ సభ్యురాలు
  • 1997-2001 వరకు ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
  • 2001 లో టి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.
  • 2001-2006 వరకు శంకరపట్నం మండలం జెడ్.పి.టి.సి సభ్యురాలు
  • 2006-2009 వరకు టి.ఆర్.ఎస్ పార్టీ ఉపాధ్యక్షురాలు
  • 2009-2014 వరకు చొప్పదండి ఇంచార్జ్ గా పనిచేశారు.
  • 2014 మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చొప్పదండి నుంచి పోటీ చేసిన శోభ భారీ మెజారిటీ విజయం సాధించారు.
  • అంటరానితనం నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s