Smt.Kova Lakshmi (TRS)

శ్రీమతి కోవా లక్ష్మి 

ఎమ్మెల్యే, టిఆర్.ఎస్ పార్టీ,
ఆసిఫాబాద్ (ఎస్టీ) నియోజక వర్గం,
ఆసిఫాబాద్ జిల్లా.
  • పుట్టిన తేదీ : ఫిబ్రవరి 6, 1969
  • పుట్టిన ప్రాంతం : భంబారా గ్రామం, వాంకడి మండలం, ఆదిలాబాద్ జిల్లా.
  • తండ్రి : కొట్నాక్ భీమారావు
  • విద్యార్హతలు : ఎస్ఎస్.సి
  • వృత్తి : పాలిటిక్స్
  • భర్త : శ్రీ సోనే రావు
  • పిల్లలు : ముగ్గురు
  • మాట్లాడే భాషలు : గొండు, తెలుగు, మరాఠీ, హిందీ
అడ్రస్: 
హౌస్ నెంబర్ : 3-752, కట్న కాలనీ, ఆసిఫాబాద్ మండల్, ఆదిలాబాద్ జిల్లా.
ప్రస్తుత చిరునామా : 
 
ప్లాట్ నెంబర్ : 39, శంకుతల ఎంక్లేవ్, టి.ఎన్.ఆర్ శంకుతల రెసిడెన్షియల్ కాంప్లెక్స్, మన్సూరాబాద్, సరూర్ నగర్ మండల్, ఎల్బీ నగర్ సర్కిల్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ స్టేట్. 
 
ఫోన్ నెంబర్స్ : 9848309284
సోషల్ మీడియా : 
కోవా లక్ష్మి గురించి : 
గొండు సామాజిక వర్గానికి చెందిన కోవా లక్ష్మి 1995 లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.  ఆసిఫాబాద్ (ఎస్టీ) నియోజక వర్గం టిఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.  మొదటిసారి పోటీ చేసి గెలుపొందిన కోవా లక్ష్మి గతంలో సర్పంచ్ గాను, ఎంపిటిసి, ఎంపిపిగాను పనిచేశారు.  రాజకీయ వాతావరణంలో పుట్టి పెరగడం వలన రాజకీయాలను బాగా అర్ధం చేసుకుని ప్రజలకు మంచి పనులు చేస్తూ ఆసిఫాబాద్ లో మంచిపేరు తెచ్చుకున్నారు.
పర్సనల్ లైఫ్ : 
1969 లో వాంకడి మండలం భంబారా గ్రామంలో జన్మించిన లక్ష్మి ఎస్.ఎస్.సి వరకు చదువుకున్నారు. తండ్రి రాజకీయాల్లో ఉండటం.. మినిష్టర్ పదవులను చేపట్టడంతో.. రాజకీయ వాతావరణం ఎలా ఉంటుందో చిన్నతనం నుంచే తెలుసుకోగలిగారు.  1995 లో రాజకీయాల్లోకి వచ్చారు.  ఆసిఫాబాద్ సర్పంచ్ గా, ఎంపిపిగా ఆమె నాలుగుసార్లు గెలుపొందారు.  ఆసిఫాబాద్ మేజర్ అభివృద్ధి కోసం కృషి చేశారు.  పార్టీ ఏదైనప్పటికీ మంచి పనులు చేస్తూ ప్రజలకు  అందుబాటులో ఉంటె గెలవడం ఖాయం అని లక్ష్మి నిరూపించారు.  భర్త కోవా సోనే రావు, పిల్లల సహకారంతోనే రాజకీయాల్లో ఎదిగినట్టు లక్ష్మి పలుమార్లు పేర్కొన్నారు.
పొలిటికల్ కెరీర్ : 
  • 1995-2000 వరకు పంగిడి మాధర గ్రామ పంచాయితీ ఎంపిటిసి గా పనిచేశారు.
  • 2006-2011 వరకు ఆసిఫాబాద్ మేజర్ పంచాయితీ సర్పంచ్ గా పనిచేశారు.
  • 2011 – 2014 వరకు ఆసిఫాబాద్ మేజర్ పంచాయితీ సర్పంచ్ గా పనిచేశారు.
  • 2014 మే నెలలో జరిగిన ఎన్నికల్లో కోవా లక్ష్మి ఆసిఫాబాద్ నియోజక వర్గం నుంచి టి.ఆర్.ఎస్. పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 19,055 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కోవా లక్ష్మికి మంత్రి పదవి వస్తుంది అని అనుకున్నా కొన్ని కారణాల వలన అది తృటిలో తప్పిపోయింది.  పార్లమెంట్ కార్యదర్శి పేరుతో కొత్త పదవులను సృష్టించి ఆ పదవిని కట్టబెట్టిన అది మూడునాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది.  హైకోర్ట్ ఈ పదవులపై స్టే ఇవ్వడంతో కోవా లక్ష్మి ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి.
ఇక కోవా లక్ష్మిపై ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కోర్టులో 2012 వ సంవత్సరంలో ఓ కేసు నమోదయినట్టు అఫిడవిట్ రికార్డు ద్వారా తెలుస్తుంది.
1.290, 323, 341, 352, 347, 448, 504, 506, 34 Section 156(3) of Cr. P. C., Crime No.56/2012 of P.S. Kasipet, Adilabad District, AP, II Addl. Judicial Magistrate of First Class, Court Mancherial
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s