Sri. Galla Jayadev (TDP)

శ్రీ గల్లా జయదేవ్

పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ,

గుంటూరు పార్లమెంట్ నియోజక వర్గం.,

ఆంధ్రప్రదేశ్.

Bio-Data

 • పుట్టిన తేదీ : మర్చి 24, 1966.
 • తండ్రి పేరు : శ్రీ రామచంద్ర నాయుడు గల్లా.
 • తల్లి పేరు : శ్రీమతి అరుణ కుమారి గల్లా.
 • పుట్టిన ప్రాంతం : దిగువమాగ్రం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
 • విద్యార్హతలు : బిఏ (పొలిటికల్ సైన్స్ & ఎకనామిక్స్), ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం, యుఎస్ఏ.
 • భార్య పేరు : శ్రీమతి పద్మావతి గల్లా.
 • పిల్లలు : 2 (సిద్దార్ధ గల్లా మరియు అశోక్ గల్లా)

అడ్రస్ : 

ఏ – 54, రోడ్ నెంబర్ – 11, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్,

హైదరాబాద్ -500034,

తెలంగాణ.

ప్రస్తుత చిరునామా :

8, కౌటిల్య మార్గ్, చాణక్యపురి,

న్యూఢిల్లీ – 110021.

ఫోన్ నెంబర్ : 09704697788

సోషల్ మీడియా : 

 • వెబ్ సైట్ :
 • ఇ మెయిల్ : jayadev.galla@sansad.nic.in, jg@jayadevgalla.in
 • పేస్ బుక్ : https://www.facebook.com/jayadev.galla/
 • ట్విట్టర్ : https://twitter.com/jaygalla

గల్లా జయదేవ్ గురించి: 

గల్లా జయదేవ్ రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తి.  దేశంలో ఆటోమొబైల్ రంగంలో అమరారాజ బ్యాటరీస్ లీడింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.  స్కూల్ విద్య నుంచి విశ్వ విద్యాలయం విద్య వరకు అమెరికాలోనే చదువుకున్నారు.  1992 లో ఇండియాకు తిరిగి వచ్చాక.. వ్యాపారవేత్తగా తండ్రితో కలిసి అమరరాజా బ్యాటరీస్ ను స్థాపించారు.  వ్యాపారంలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గల్లా జయదేవ్.. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన తన తల్లి గల్లా అరుణ కుమారితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.  గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.  దేశంలో సంపన్న రాజకీయనాయకుల్లో గల్లా జయదేవ్ కూడా ఒకరు.

పర్సనల్ కెరీర్ : 

మార్చి 24, 1966లో గల్లా జయదేవ్ చిత్తూరు జిల్లాలోని దిగువమగ్రంలో జన్మించారు.  తండ్రి రామచంద్ర నాయుడు వ్యాపారవేత్తకాగా, తల్లి గల్లా అరుణ కుమారి రాజకీయ నాయకురాలు.  వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన వ్యక్తుల కుటుంబంలోనుంచి వచ్చిన వ్యక్తి కావడం, రాజకీయాలను దగ్గరి నుంచి చూసే అవకాశం కలిగింది.  సామాజిక సేవపై  ఆసక్తి ఉండటంతో.. రాజన్న ట్రస్ట్ మరియు కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లకు పర్మినెంట్ ట్రస్టీగా ఉన్నారు.  విద్యను ప్రోత్సహించేందుకు, గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతను పెంచేందుకు, యువతలో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ ట్రస్ట్ లు పనిచేస్తున్నాయి.  చారిత్రాత్మక అంశాల గురించి పరిశోధించడం గల్లా జయదేవ్ హాబీలలో ఒకటి.  గోల్ఫ్, టెన్నిస్, క్రికెట్, స్క్వాష్ క్రీడలపై ఆసక్తి ఉంది.  ఆంధ్రప్రదేశ్ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్నారు.

జూన్ 26, 1991లో తెలుగు రాష్ట్రాల్లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి కూతురు ఘట్టమనేని పద్మను వివాహం చేసుకున్నారు.  వీరికి ఇద్దరు పిల్లలు.  సిద్దార్ధ్ గల్లా, అశోక్ గల్లా.

పొలిటికల్ కెరీర్ : 

 • 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ నియోజక వర్గం పోటీ చేసి 16 వ లోక్ సభకు ఎంపీగా గెలుపొందారు.
 •  సెప్టెంబర్ 1, 2014 నుంచి కామర్స్ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
 • కేంద్ర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన పవర్ మరియు పునరుత్పాదక శక్తి సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
 •  ప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు తీర్మానాల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
 • కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వశాఖ ఆద్వర్యంలోని టొబాకో బోర్డు లో సభ్యుడిగా ఉన్నారు.
 • మే 11, 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సవరణ బిల్లు కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.  2014 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ & పర్యవేక్షణ కమిటీకి కో చైర్మన్ గా కొనసాగుతున్నారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s