మాటల యుద్ధం ముగిసింది – ‘మీట’ల రణం మొదలైంది

మాటల యుద్ధం ముగిసింది – ‘మీట’ల రణం మొదలైంది

మనిషికి శరీరంలో గుండె ఎంత ముఖ్యమైన అవయవమో.. దేశానికీ ఉత్తరప్రదేశ్ కూడా అలాంటిదే.  దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.  ఉత్తరప్రదేశ్ లో మొత్తం 404 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.  ఈ 404 అసెంబ్లీ స్థానాలకు గాను తొలివిడతగా 73 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  మొత్తం 5 దశలలో పోలింగ్ జరుగుతుంది.
ఇక ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలౌతుంది.  అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, బీజేపీలు ప్రధానంగా బరిలో ఉన్నాయి.  ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి ఎస్పీ ప్రయత్నిస్తుంది.  ఇందులో భాగంగా ఎస్పీ , కాంగ్రెస్ తో దోస్తీ కట్టింది.  కాంగ్రెస్ ఉత్తర ప్రదేశ్ లో చాలా బలహీనంగా ఉంది.  ఈ ఎన్నికల్లో ఎస్పీతో కలిస్తే బలపడొచ్చని భావిస్తుంది.  ఇక, బీఎస్పీ కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది.
బీజేపీ విషయానికి వస్తే 2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో 70 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి రికార్డ్ నెలకొల్పింది.  ప్రధాని మోడీ వారణాసి నుంచి మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు.  నోట్ల రద్దు తరువాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి బీజేపీకి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది అన్నది ఇక్కడ ముఖ్యం.  సర్వేలు బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి.  అయితే, ప్రజలు మనోగతం పోలింగ్ బూత్ లో ఓటు వేసే వరకు ఎలా ఉంటుందో ఎవరివైపు మారుతుందో చెప్పలేం కాబట్టి రిజల్ట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Leave a comment