Uttara Pradesh Elections 2017 Live Updates

ఉత్తరప్రదేశ్ – పోలింగ్ రణం

  • తోలి విడత ఎన్నికల్లో 67% పోలింగ్ నమోదయినట్టు తెలుస్తుంది.  అనుకున్న దానికంటే తక్కువ పోలింగ్ నమోదయింది.   ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
  • తొలిదశ పోలింగ్ చివరిదశకు చేరుకుంది.  మరి కాసేపట్లో పోలింగ్ ముగుస్తుంది.  ఇప్పటికే ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఉత్తరప్రదేశ్ లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనే విషయం మరి కాసేపట్లో తేలిపోతుంది.
  • తొలివిడత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు.  మంచి నాయకులను, తమకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  ఎప్పుడు ఓటింగ్ కు దూరంగా ఉండే యువత గత కొంతకాలంగా రాజకీయాల్లో వస్తున్న మార్పును గమనించి.. తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  తొలిసారి ఓటు హక్కు సంపాదించుకున్న యువత కూడా ఓటింగ్ లో పాల్గొంటున్నది.  ఎవరికీ ఓటు వేశారు అన్నది మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.  ఇక ఎన్నికల రిజల్ట్ వచ్చేవరకు ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు అన్నది తెలియదు.
  • 3 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి..
  • భాగపత్ – 54%
  • మధుర – 53%
  • ఫిరోజాబాద్ – 53.8%
  • ఆగ్రా – 56.08%
  • ముజఫర్ నగర్ – 54%
  • మీరట్ – 52%

  • సాయంత్రం 3 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ లో 52.90 % పోలింగ్ నమోదయింది.
  •  అవినీతిపై యుద్ధం ప్రకటించగానే.. ప్రతిపక్షాలు ఒక్కటిగా మారి తమను విమర్శిస్తున్నాయని.. అవినీతి రహిత భారతదేశమే తమ లక్ష్యమని పేరొన్నారు ఉత్తరప్రదేశ్ లో అవినీతిపై ఎస్పీ, బీఎస్పీలు కలిసి మాట్లాడుతున్నాయని అన్నారు.  అవినీతిపై తమ ఆపేదిలేదని మోడీ స్పష్టం చేశారు.
  • ఉత్తరాఖండ్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. స్వతంత్రం అచ్చిన 70 సంవత్సరాలైనా.. దేశంలో చాలా గ్రామాల్లో కరెంట్ లేదని.. 18000 గ్రామాలు ఇప్పటికి చీకట్లోనే మగ్గుతున్నాయని మోడీ పేర్కొన్నారు.
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు అందిన సమాచారం ప్రకారం ఉత్తర ప్రదేశ్ లో తొలివిడత ఎన్నికల్లో 39.43% పోలింగ్ నమోదయింది.
  • మధ్యాహ్నం ఒంటి గంటవరకు అందిన సమాచారం ప్రకారం పోలింగ్ శాతం ఇలా ఉంది.
  • ముజఫర్ నగర్ 42%
  • షామ్లీ – 46 %
  • ఫిరోజాబాద్ 41.8%
  • 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి..
  • ముజఫర్ నగర్ – 27%
  • ఫిరోజాబాద్ – 21%
  • షామ్లీ – 21%
  • మథుర 24.8%
  • ఘజియాబాద్ 26%
  • అలీఘర్ – 25%
  • UP Poll percentage till 11am – Muzaffarnagar 27% – Firozabad 21% – Shamli 21% – Mathura 24.8% – Ghaziabad 26% – Aligarh 25%
  • బ్రహ్మపురి & దాద్రి లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు.  తమ సొంత నిర్ణయం మేరకు ఓటు వేస్తామని.. ఎవరికీ భయపడేది లేదని మహిళలు పేర్కొంటున్నారు.

  • ఆప్ నేత రాహుల్ విశ్వాస్ ఘజియాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

https://twitter.com/TimesNow/status/830305514575720449

  • 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ లో 24% శాతం పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది.
  • 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం షామ్లి నియోజక వర్గంలో 29%
  •  పోలింగ్ జరిగింది.

  • ఉత్తరప్రదేశ్ లో బహుజన సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు బీఎస్పీ అధినేత మాయావతి.  ప్రజల మద్దతు తమకే ఉంటుందని ఆమె తెలిపారు.

  • కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ ముజఫర్ నగర్  లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • హాపూర్ నియోజక వర్గంలో పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరిన మహిళా ఓటర్లు.

  • తొలివిడత ఎన్నికలు జరుగుతున్న 73 నియోజక వర్గాల్లో ఉదయం 9 గంటల వరకు పోలైన పోలింగ్ పర్సెంటేజ్ వివరాలు.

  • ఎన్నికలను బహిష్కరించిన జిరౌలి, రామ్ నాగ్లా, సంతోషి నాగ్లా & మోహన్ధపూర్ గ్రామాల ప్రజలు
  • ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో దర్శనమిస్తున్న మోడీ, బీజేపీ జిలేబీలు

  • 10.56% voting in first phase of Uttar Pradesh elections till 9 am
  • 15% voting in Muzaffarnagar till 9 am
  • 10.5% voting in Aligarh and 12% in Bulandshahr till 9 am

  • చాప్రాలి నియోజక వర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న 98 సంవత్సరాల సుల్తాని.  తన కొడుకు సహాయంతో పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నది.
  • సర్దనా నియోజక వర్గం నుంచి బరిలో ఉన్న బిజెపి అభ్యర్థి సంగీత్ సోమ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • రాజకీయంగా అత్యంత చురుకైన రాష్ట్రం, అత్యంత కీలకమైన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.  ఉత్తరప్రదేశ్ 404అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఐదు దశలలో జరుగుతున్నాయి.  ఇందులో భాగంగా మొదటిదశ పోలింగ్ నేడు జరుగుతున్నది.  73 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  823 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  ప్రజలు ఎవరికీ మద్దతు పలుకుతారో చూడాలి.  ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.  ఓటు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఆయుధం.  కాబట్టి తప్పకుండా ఓటు హక్కు ఉన్న అందరూ తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోండి.
  • ఉదయం 9 గంటల వరకు 10 % ఓటింగ్ జరిగింది.  నోయిడాలో 9% పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది.
  • నోయిడా సెక్టార్ 12 లో పోలింగ్ దృశ్యాలు

  • నోయిడా సెక్టార్ 22 లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  పెద్ద సంఖ్యలో యువత ఓటింగ్ లో పాల్గొంటున్నది.

  • ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద నియోజక వర్గం పేరు షాహిబాబాద్. ఇది ఘజియాబాద్ జిల్లాలో ఉంది.

  • భాగపత్ లోని బ్రుత్ ఓటర్లకు రోజాపూలు ఇచ్చి స్వగతం పలుకుతున్న ఎన్నికల కమిషన్ అధికారులు.  ప్రజలు స్వచ్చందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు చెప్తున్నారు.

  • బులంద్ షార్ లోని యువత తమ ఓటు హక్కును వినియోగించుకుంటుంది. యువత పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో ఓటింగ్ వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

  • మధుర బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ శర్మ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

  • మధుర గోవర్ధన్ భవన్ లోని 42 వ బూత్ లో, భాగపత్ లోని 119, 120 నెంబర్ బూత్ లలో ఈవీఎం లు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యం అయింది.

  • షామిలి తానా భవన్ లో పోలింగ్ వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.  ఉదయం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సందడి మొదలైంది.

 

  • నోయిడా సెక్టార్ 15A లో పోలింగ్ ప్రారంభమైంది.
  • ఉత్తర ప్రదేశ్ లోని దాద్రిలోని బిషాడ లో  పోలింగ్ మొదలైంది.  అక్కడి ప్రజలు తమ ఓటింగ్ ను వినియోగించుకుంటున్నారు.
  • 73 స్థానాలకు పోలింగ్ మొదలైంది.  ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు.  73 స్థానాల్లో మొత్తం 823 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
  • 2.69 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
  • 1.17 కోట్ల మంది మహిళలు కాగా 1580 మంది థర్డ్ జెండర్ కు చెందిన ఓటర్లు ఉన్నారు.  15 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
  • ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల రణం మొదలైంది.  మొన్నటి వరకు వాడి వేడిగా, జోరుగా ప్రచారం జరిగింది.  అన్ని పార్టీలు తమ శక్తి సామర్ధ్యాల మేరకు ప్రచారం నిర్వహించారు.  కాగా, ఫిబ్రవరి 11 న ఉత్తరప్రదేశ్ 404 స్థానాలకు గాను తొలివిడతగా 73 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది.
Advertisements

One thought on “Uttara Pradesh Elections 2017 Live Updates

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s