Smt.D.A. Satyaprabha (TDP)

శ్రీమతి డి ఏ సత్యప్రభ 

ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ,
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
  • పుట్టిన తేదీ :  21/09/1951
  • పుట్టిన ప్రాంతం : బెంగళూరు
  • తండ్రి : మునివెంకటసమప్ప
  • విద్యార్హతలు : పీయూసీ
  • భర్త : ఆదికేశవనాయుడు
  • వృత్తి : సోషల్ వర్కర్
  • పిల్లలు : ముగ్గురు
  • వచ్చిన భాషలు : తెలుగు, కన్నడం, హిందీ
అడ్రస్ : 
24-3, లక్ష్మి నగర్ కాలనీ, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ప్రస్తుత చిరునామా : 
ప్లాట్ నెంబర్ 185, నందగిరి హిల్స్, ఆదిత్య హిల్స్, పారడైజ్, హైదరాబాద్.

ఫోన్ నెంబర్స్ :  9845741877; 9490085555

సోషల్ మీడియా : 
ట్విట్టర్ :
సత్యప్రభ గురించి : 
సత్యప్రభ.. 2014 కు ముందు రాష్ట్రంలో పెద్దగా పరిచయంలేని పేరు.  ఆదికేశవుల నాయుడు భార్యగా మాత్రమే ఆమె పరిచయం.  విద్యాసంస్థల నిర్వహణ, తీరిక సమయంలో పుట్టపర్తిలోని స్వామివారి సేవ చేయడం చేస్తుంటారు.  చిత్తూరులో ప్రాధమిక విద్య అభివృధ్ధికోసం విద్యాసంస్థలు నెలకొల్పి అతి తక్కువ రుసుముతో విద్యను బోధిస్తున్నారు.  అయితే, 2014 కు ముందు తెలుగుదేశం పార్టీలో చిత్తూరు జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఆదికేశవుల నాయుడు హఠాత్తుగా మరణించడంతో..సత్యప్రభ రాజకీయాల్లోకి రావలసిన పరిస్థితి ఏర్పడింది.  త్రాగునీరు, వైద్యంను తన అజెండాగా పెట్టుకొని ప్రచారం నిర్వహించి.. చిత్తూరు నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.
పర్సనల్ లైఫ్ : 
1951లో బెంగళూరులో జన్మించిన సత్యప్రభ విద్యాబ్యాసం బెంగళూరులోనే పూర్తిచేశారు.  1966-67 లో బెంగళూరులోని బిఎంఎస్ మహిళా కళాశాలలో పీయూసీ పూర్తిచేశారు.  1968లో ఆదికేశవుల నాయుడుతో వివాహం జరిగింది.  వీరికి ముగ్గురు సంతానం.  స్కూల్ సెలవులు ఉన్నప్పుడు సత్యప్రభ పుట్టపర్తి వచ్చి అక్కడే సెలవులను గడిపేవారు.  అలా పుట్టపర్తితో అనుబంధం పెరిగింది.  వివాహం తరువాత చిత్తూరు జిల్లాలో శ్రీనివాస ట్రస్ట్ ను నెలకొల్పారు.  ఆ ట్రస్ట్ కు చైర్మన్ గా కొనసాగుతున్నారు.  జిల్లాలో ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా పెట్టుకొని కృషి చేస్తున్నారు.
పొలిటికల్ కెరీర్ :  
  • 2014 లో తెలుగుదేశం పార్టీలో చేరారు.
  • 2014 మే లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి వైకాపా అభ్యర్థిపై 6,813 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
  • శ్రీనివాస ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
  • అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
  • అసెంబ్లీ మహిళా శిశుసంక్షేమ కమిటీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
  • అసెంబ్లీ సాధారణ కమిటీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
  • ఎన్నిఅకాల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో దాదాపు 270 కోట్లరూపాయల ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. సత్యప్రభ ఆస్తుల వివరాలు వివాదంగా మారింది.  సత్యప్రభకు చెందిన ఆస్తులపై ఐటి శాఖ తనిఖీలు కూడా నిర్వహించింది.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s