Smt. R.K. Roja (YSRCP)

శ్రీమతి ఆర్ కె రోజా 
 మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,,
నగరి నియోజక వర్గం,
చిత్తూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
ఫోన్ నెంబర్ : 7207297979; 9000400616
అడ్రస్ : 
ఆర్ కె రోజా.,
ఎమ్మెల్యే.,
8-3-998/78/402, వేణు ప్లాటినం అపార్ట్మెంట్స్,
శ్రీనగర్ కాలనీ,  మెయిన్  రోడ్,
హైదరాబాద్,
తెలంగాణ.
రోజా గురించి: 
రోజా 1972, నవంబర్ 17 వ తేదీన చిత్తూరు జిల్లాలోని బాకరంపేటలో నాగరాజా రెడ్డి, లలితా దంపతులకు జన్మించారు.  రోజా అసలు పేరు శ్రీలత.  అయితే, సినీరంగ ప్రవేశం చేసే సమయంలో ఆమె రోజాగా పేరు మార్చుకుంది.  తరువాత కుటుంబం చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వచ్చేశారు.  రోజా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ లో బ్యాచులర్ డిగ్రీ చేశారు.  సినీరంగ ప్రవేశం చేసేముందు ఆమె కూచిపూడి నాట్యం కూడా నేర్చుకున్నారు.
సిని రంగం :
చదువు పూర్తయ్యాక రోజా 1991 వ సంవత్సరంలో ప్రేమ తపస్సు చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు.  అనంతరం తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో అనేక చిత్రాల్లో రోజా నటించింది.  అప్పట్లో అగ్రకథాయకులుగా ఉన్న హీరోలతో కలిసి ఆమె నటించింది.
రాజకీయ రంగం :
సినిమాలలో మంచినటిగా పేరు తెచ్చుకున్న సమయంలో రోజా చూపు రాజకీయాలపై పడింది.  చిన్నతనం నుంచి కష్టాలు అనుభవించి వచ్చిన రోజా.. సినీరంగంలో నిలదొక్కుకున్నాక అనేక మందికి ఆమె తనవంతు సహాయం అందించారు.  సినిమా తారగా ఉంది సేవ చేయడం కంటే.. రాజకీయాల్లో ఉంటె ప్రజలకు మరింత సేవలు అందించవచ్చు అని భావించిన రోజా.. రాజకీయాల్లోకి వచ్చారు.
కొత్త వారికి అవకాశాలు కల్పించే తెలుగుదేశం పార్టీ రోజాకు అవకాశం కల్పించింది.  రోజాను పార్టీలోకి ఆహ్వానించింది.  తెలుగుదేశం పార్టీలో చేరిన రోజా.. కొద్దికాలంలోనే పార్టీలో చురుకైన పాత్రను పోషించి అందరి మన్ననలు పొందింది.  ఆ సమయంలో పార్టీ ఆమెను తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమించింది.
2009 ఎన్నికల్లో రోజాకు తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది.  అయితే, రోజాకు పార్టీ టిక్కెట్ కేటాయించడంపై పలువురు సీనియర్ నాయకులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.  తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొందరు వ్యక్తులు, సొంత పార్టీలో ఉన్న మరికొందరు రోజాకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించినట్టు మీడియాలో కధనాలు వెలువడిన సంగతి తెలిసిందే.  2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగడంతో.. తెలుగుదేశంఓటమిపాలైంది.  చంద్రగిరి నుంచి పోటీ చేసిన రోజా ఓడిపోయింది.
రోజా ఓటమికి పార్టీలోని నాయకులే కారణం అని పేర్కొని.. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు.  ఆగష్టు 2009 లో కాంగ్రెస్ పార్టీలో చేరింది.  కొంతకాలం తరువాత, కాంగ్రెస్ కు స్వస్తి పలికి వైకాపాలో జాయిన్ అయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో రోజా చిత్తూరు జిల్లాలోని నగరి నుంచి వైకాపా తరపున పోటీచేసింది.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిపోవడం, వైకాపా బలం పుంజుకోవడంత రోజా నగరి నుంచి విజయం సాధించారు.  ప్రస్తుతం రోజా నగరి నియోజకవర్గ శాసనసభ్యురాలిగా కొనసాగుతున్నారు.
2015లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజా గౌరవ సభ్యుల గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.  అయితే, ప్రతిపక్షంలో ఉన్న వైకాపా రోజాపై తీసుకున్న సస్పెండ్ యాక్షన్ కు విరుద్ధంగా వైకాపా ధర్నాలు నిర్వహించింది.  సభలో సభ్యురాలికి అన్యాయం జరిగిందని వైకాపా నేతలు, మహిళా నేత రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పర్సనల్ లైఫ్ : 
సినీరంగంలో ఉండగా రోజా తమిళ దర్శకుడు ఆర్ కె సెల్వమణితో ప్రేమలో పడింది.  ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  వీరికి ఇద్దరు పిల్లలు.  రోజా అటు ఎమ్మెల్యేగా బిజీగా ఉంటూనే.. బుల్లితెరపై అనేక కార్యక్రమాలు చేస్తున్నది.  తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫెమసైన  జబర్దస్త్ కు  న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.  జెమిని టీవీలో ప్రసారం అవుతున్న రచ్చబండ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తుంది.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s