Sri. Gokaraju Gangaraju(BJP)

శ్రీ గోకరాజు గంగరాజు

ఎంపీ, భారతీయ జనతాపార్టీ

నరసాపూర్ పార్లమెంట్ నియోజక వర్గం,

ఆంధ్రప్రదేశ్.

 • పుట్టిన తేదీ : జూన్ 14, 1948
 • పుట్టిన ప్రాంతం : కాసవరం, పశ్చిమ గోదావరి.
 • తండ్రి పేరు : గోకరాజు రంగరాజు
 • విద్యార్హతలు : బి.ఫార్మసీ
 • వృత్తి : బిజినెస్
 • భార్య : శ్రీమతి లైలా గోకరాజు
 • పిల్లలు : 3 (ఇద్దరు కుమారులు ఒక కుమార్తె)

అడ్రస్ :

హౌస్ నెంబర్ : 40-15/14, సుదర్శన్ అపార్ట్మెంట్స్,,

బృందావన్ కాలనీ, లబ్బీపేట, విజయవాడ.

ఆంధ్రప్రదేశ్ – 520010.

ప్రస్తుత చిరునామా : 

167&169, నార్త్ అవెన్యూ,

న్యూఢిల్లీ -110001.

ఫోన్ నెంబర్స్ :

Tel : (0866) 2464445/6, 09848125500 (M)
Fax : (0866) 2464447

Telefax : (011) 2309497509013869926 (M)

సోషల్ మీడియా : 

గోకరాజు గురించి : 

గోకరాజు గంగరాజు ఆంధ్రప్రదేశ్ లోని చాలా మందికి సుపరిచితమైన వ్యక్తి.  గోకరాజు గంగరాజు ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూషన్స్  తెలుగురాష్ట్రాల్లో ఫెమౌస్ ఇంస్టిట్యూషన్స్.  భారతీయ జనతాపార్టీ తరపున 2014 లో నరసాపురం పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ నుంచి  వచ్చిన వ్యక్తి కావడం, ఈ రెండు సంస్థలు గోకరాజు వైపు మొగ్గు చూపడంతో బిజెపి అధిష్ఠానం గోకరాజుకు నరసాపూర్ టిక్కెట్ ఇచ్చింది.

పర్సనల్ లైఫ్ : 

1948 వ సంవత్సరంలో జన్మించిన  గోకరాజు బీఫార్మసీ వరకు చదువుకున్నారు.  చిన్న తనం నుంచి ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ లో ప్రచారక్ గా పనిచేశారు.  ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలి.. జీవితంలో ఎలాంటి నిర్ణయాలుతీసుకోవాలి.. డిసిప్లేన్ ఎలా ఉండాలి అనే విషయాలను  అక్కడ  తెలుసుకున్నారు.  గోకరాజు తండ్రి రంగరాజు రాజకీయాలకు చెందిన వ్యక్తి.  రంగరాజు ఉండి ఎమ్మెల్యేగా పనిచేశారు.  తండ్రి రాజకీయ రంగంలో ఉండటంతో.. రాజకీయాలపట్ల మక్కువ పెరిగింది.  అయితే, గోకరాజు విద్యాసంస్థలను నెలకొల్పడంతో.. ఎక్కువ సమయం విద్యాసంస్థల నిర్వహణతోనే సరిపోయింది.  గోకరాజు గంగరాజు భార్య లైలా పేరుమీద కంపెనీలను ఏర్పాటు చేశారు.  చిన్న జీయర్ స్వామీ ఆధ్వర్యంలో నడుస్తున్న జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు చైర్మన్ గా ఉన్నారు.  గాంధీ హిల్ ఫౌండషన్ కు అధ్యక్షుడిగాను, వరల్డ్ తెలుగు ఫెడరేషన్ కు వైస్ ప్రెసిడెంట్ గాను ఉన్నారు.  డాక్టర్ మంతెన సత్యన్నారాయణ రాజు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న నేచర్ క్యూర్ హాస్పిటల్ కు ట్రస్టీగా ఉన్నారు.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు సెక్రటరీగా ఉన్నారు.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కు వైస్ ప్రెసిడెంట్ గా నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు.

ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చైర్మన్ గా ఉన్నారు.

ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ను విదేశాలకు ఎగుమతి విషయంలో 1981-1982 వ సంవత్సరంలో బెస్ట్ ఎక్స్పోర్ట్ అవార్డు అందుకున్నారు.

పొలిటికల్ కెరీర్ :

 • మే 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోకరాజు ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం పార్లమెంట్ నియోజక వర్గం నుంచి భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
 • సెప్టెంబర్ 1, 2014 నుంచి గ్రామీణాభివృద్ధి పై వేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
 • కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నడుస్తున్న టొబాకో బోర్డులో మెంబర్ గా ఉన్నారు.
 • అధికార భాషా కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
 • వైజాగ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కు చైర్మన్ గా ఉన్నారు.
 • సెప్టెంబర్ 5, 2015 నుంచి పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు సంబంధించిన జాయింట్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
 • కేంద్ర పట్టణాభివృద్ధి, హోసింగ్ మరియు  పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s