Sri Raman Deka (BJP)

శ్రీ రామెన్ దేక

ఎంపీ., భారతీయ జనతాపార్టీ,

మంగలదోయ్ పార్లమెంట్ నియోజక వర్గం,

అస్సాం.

 

  • పుట్టిన తేదీ : మార్చి 1, 1954
  • పుట్టిన ప్రాంతం : సువాల్కుచి, కమ్రుప్, అస్సాం.
  • తండ్రి పేరు : శ్రీ సురేంద్రనాథ్ దేక
  • విద్యార్హతలు : బి.ఏ (ఫిలాసఫీ & ఎకనామిక్స్)
  • భార్య : రాణీ దేకాకకోటి
  • పిల్లలు : 2 (కుమారుడు, కుమార్తె)
  • వృత్తి : బిజినెస్

 

అడ్రస్ :

కేసి రోడ్ (నికోలస్ స్కూల్ దగ్గర),

చార్టీబరి, గౌహతి – 781 008,

అస్సాం.

ప్రస్తుత చిరునామా : 

3, ఫిరోజ్షా రోడ్,

న్యూఢిల్లీ  -110001.

ఫోన్ నెంబర్స్ : Tel : (0361) 263636609435041680 (M)

Tel : (011) 237826379013180166 (M)

సోషల్ మీడియా : 

రామెన్  గురించి :

భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నారు.  భారతీయ జనతాపార్టీ మొదట జనతాపార్టీగా ఉన్న సంగతి తెలిసిందే.  చదువు పూర్తికాగానే రామెన్  రాజకీయాల్లోకి వచ్చారు.  1977 లో అస్సామ్ జనతాపార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.  జనతాపార్టీలో చేరిన దగ్గరి నుంచి భారతీయ జనతాపార్టీగా మారిన తరువాత.. ఇప్పటి వరకు ఆయన భారతీయ జనతాపార్టీలోనే కొనసాగుతున్నారు.  పార్టీతో ఆయనకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది.  రామెన్ అస్సాం రాష్ట్ర రాజకీయాలలో ఓ కీలకమైన వ్యక్తిగా ఉన్నారు.  ఆర్ఎస్ఎస్ లో పూర్తిస్థాయి ప్రచారక్ గా ఉన్న రామెన్ లో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను పార్టీకి రికమండ్ చేసింది.  1977 నుంచి పార్టీతో అనుబంధం ఉన్నా.. పార్లమెంట్ కు 2009 లో మొదటిసారి ఎంపికయ్యారు.

పర్సనల్ లైఫ్ : 

మార్చి 1, 1954 లో అస్సాంలో జన్మించిన రామెన్ అస్సాం విశ్వ విద్యాలయంలో బీఏ చదువుకున్నారు.  చదువు తరువాత కొంతకాలం బిజినెస్ చేసినప్పటికీ రాజకీయాలపై మక్కువతో 1977లో జనతాపార్టీలో చేరారు.  ఆర్ఎస్ఎస్ అండదండలు జనతాపార్టీలో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడ్డాయి.  1972 లో ఏబివిపి పూర్వాంచల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.  హోల్ సేల్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ కు అడ్వైజర్ గా పనిచేశారు.  1974 -75 వరకు గౌహతి విశ్వవిద్యాలయం కోర్ట్ మెంబర్ గా పనిచేశారు.  1979లో అస్సాం సాహిత్య సభ కు కల్చరర్ సెక్రటరీ గా పనిచేశారు.  ఖాళీగా ఉన్న సమయాల్లో ఫుట్ బాల్ అంటే ఇష్టపడే రామెన్ ఖాళీ సమయాల్లో చెస్ ఆడతారు.  రామెన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పొలిటికల్ కెరీర్ : 

  • 1977 లో అస్సాం జనతాపార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
  • 1980 లో బీజేపీ ఫౌండర్ మెంబర్ గా ఉన్నారు.
  • 2005 లో బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.
  • బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీగాను, అస్సాం బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గాను పనిచేశారు.
  • బిజెపి ఈశాన్య రాష్ట్రాల  కోఆర్డినేషన్ కౌన్సిల్ మరియు జాతీయ కౌన్సిల్  జనరల్ సెక్రటరీ గా పనిచేశారు.
  • 2006 లో బీజేపీ అస్సాం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
  • 2009 లో అస్సాంలోని మంగలదోయ్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
  • ఆగష్టు 31, 2009 నుంచి మే 2014 వరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
  • మే 1, 2010 లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మెంబర్.
  • సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో మెంబర్
  • కేంద్ర గనుల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యులుగా వ్యవహరించారు.
  • మే 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగలదోయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తిరిగి ఎంపికయ్యారు.
  • జూన్ 9, 2014 నుంచి లోక్ సభ ప్యానల్ చైర్ పర్సన్స్ లో సభ్యులుగా ఉన్నారు.
  • ఆగష్టు 14, 2014 నుంచి ఎస్టిమేట్స్ కమిటీలో మెంబర్ గా కొనసాగుతున్నారు.
  • సెప్టెంబర్ 1, 2014 కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
  • విదేశాంగ శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యులు.
  • ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన కేంద్ర అడ్వైజరీ కమిటీలో సభ్యులు.
  • జనవరి 29, 2015 నుంచి సాధారణ ప్రయోజనాల కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
  • జులై 3, 2015 నుంచి ఎస్టిమేట్స్ కమిటీ, సబ్ కమిటీ -II లో సభ్యులుగా ఉన్నారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s