నిలబెట్టుకోవాలని ఒకరు – నిలబడాలని మరొకరు..

ఉత్తరాఖండ్.. ఈ రాష్ట్రానికి దేవభూమి అనే పేరుకూడా ఉంది.  దేవభూమి అంటే.. దేవతలు తిరిగే ప్రాంతం అని అర్ధం.  కొంతప్రాంతాలు, ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక భావనలతో నించి ఉండే ఈ రాష్ట్రానికి ఫిబ్రవరి 15 న ఎన్నికలు జరుగుతున్నాయి.  1.01 కోట్ల మంది జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.  ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.  కాంగ్రెస్, దాని మిత్రపక్షాలైన బి.ఎస్.పి, పి.డి.ఎఫ్ లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  కాగా, ఇప్పుడు పోరు కాంగ్రెస్, బీజేపీ ల మధ్య ఉంది అనేది వాస్తవం.
ప్రధానితో సహా బీజేపీ అగ్రనేతలు.. ప్రధాన నేతలు అంతా ఉత్తరాఖండ్ లో ప్రచారం నిర్వహించారు.  దేవభూమిని.. కాంగ్రెస్ పార్టీ లూటీ భూమిగా మార్చిందని ఆరోపించారు.  రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని నేతలు కోరారు.
అయితే, ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ వ్యాఖ్యలను తిప్పికోట్టింది.  బీజేపీ మాటలు నమ్మొద్దని.. మాటలు చెప్పడమే ఆ పార్టీకి తెలుసునని.. చేతలు శున్యం అని పేర్కొంది.  ఎన్నికల ప్రచారంలో ఇవన్నీ మామూలే కాబట్టి ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  అందరి సభలకు జనాలు వస్తారు (ఎందుకు వస్తారో తెలుసుకదా నాయనా).  ఉపన్యాసాలు వింటారు.  తిరిగి వెళ్ళిపోతారు.  పోలింగ్ సమయంలో ఎవరికీ ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసు.  ఇప్పుడున్న ప్రజలకు రాజకీయాల గురించి నాయకులకంటే బాగా తెలుసు.  కాబట్టి ఎవరి వేయాలి అనుకుంటారో… వారికే ఓటు వేస్తారు.
ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా.  ఇందులో ఫిబ్రవరి 15 న 69 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి.  ఉత్తరాఖండ్ లోని కర్ణప్రయాగ్ నుంచి బరిలో ఉన్న బి.ఎస్.పి అభ్యర్థి కుల్దీప్ కణ్వసి రోడ్డు ప్రమాదంలో హఠాత్తుగా మరణించడంతో.. ఈ సీటు ఎన్నికలు వాయిదా వేశారు.  మార్చి 9 న ఈ సీటుకు ఎన్నికలు జరుగుతాయి.
69 స్థానాల కోసం 628 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.  75,13,547 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు.  ఎలాగైనా గెలిచి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒకరు.. భారీగా విజయం సాధించి తమ ఉనికిని చాటుకోవాలని మరొకరు చూస్తున్నారు.  ప్రజలు అవకాశాన్ని ఎవరికీ ఇస్తారో మరి చూద్దాం.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s