రెండోదశ పోరాటం – ఉత్కంఠం

ఉత్తరప్రదేశ్ లో రెండో దశ ఎన్నికలకు అంతా సిద్దమయింది.  ఫిబ్రవరి 15 ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలౌతుంది.  ఉత్తరప్రదేశ్ లోని 11 జిల్లాల్లో 67 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  మొత్తం 720 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  ఈనెల 11న మొదటిదశ ఎన్నికలు పూర్తయిన సంగతి విదితమే.  73 స్థానాలకు మొదటిదశ ఎన్నికలు జరిగాయి.  మొత్తం 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఐదు దశల్లో పోలింగ్ జరుగుతుంది.
రెండో దశ ఎన్నికలు జరిగే జిల్లాలు ఈ విధంగా ఉన్నాయి. షహరాన్ పూర్, బింజోర్, మొరాదాబాద్, సంబల్, రాంపూర్, బరేలి, అంరోహ, ఫిలిబిత్, ఖేరి, షార్జహన్ పూర్, బదౌన్ జిల్లాలు.
ఇందులో బరేలి కాంగ్రెస్ కు కంచుకోట.  అయితే, అభివృద్ధి పరంగా ఈ జిల్లా వెనకబడి ఉంది.  ఇక్కడ ప్రజలు ఎవరికీ ఓటు వేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరం.  ఇక ఫిలిబిత్ విషయానికి వస్తే.. ఫిలిబిత్ గ్రామాల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.  ఇక్కడి నుంచే హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి.  ఈ జిల్లా ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారో ప్రశ్నర్థకమే.  వీరి ఓట్లు పెద్ద మనుషుల చేతిలో ఉంటాయనేది వాస్తవం.  వారు (పెద్దమనుషులు) ఎలా చెప్తే అలా వేస్తారు.. వేయక తప్పదు.  ఉత్తరప్రదేశ్ లో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బదౌన్ కూడా ఒకటి.
రెండో దశ పోలింగ్ ఎంత జరుగుతుంది అనేది పక్కన పెడితే.. ఈ 11 జిల్లాలో జరిగే పోలింగ్ లో ఎవరికీ మెజారిటీ వస్తుంది అనే దానిపై ఆధారపడే ప్రభుత్వ ఏర్పాటు ఉంటుంది.  ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమౌతుంది.. సాయంత్రం 5 కు ముగుస్తుంది.  ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.  గెలుపుపై అన్నిపార్టీలు ధీమాగా ఉన్నా..గెలుపు  ఎవరినో ఒక్కరినే వరిస్తుంది.  ఆ ఒక్కరు ఎవరు అనేది మార్చి 11 న తెలుస్తుంది.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s