UP and Uttarakhand Elections 2017

ఎన్నికల యుద్ధం – అమీతుమీకి సిద్ధం

  • ఉత్తరప్రదేశ్ : సాయంత్రం  3 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 54.27% ఓటింగ్ నమోదయినట్టు తెలుస్తుంది.
  • సాయంత్రం 2 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ లో 45% ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది.
  • సాయంత్రం `1 గంట వరకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ లో 40% పోలింగ్ జరిగింది.  ఇక, హరిద్వార్ లో 47% శాతం పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది.
  • పెళ్లి తంతు పూర్తి చేసుకున్న వెంటనే బరేలిలో ఓటేసిన కొత్త జంట.  ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కని.. ఓటు వేయడం తమ బాధ్యతని కొత్తజంట పేర్కొంది.
  • ఉత్తరప్రదేశ్ : 115 సంవత్సరాల వయసు కలిగిన జురియాత్ హుస్సేన్ కుటుంబసభ్యుల సహాయంతో బరేలిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ లో 22% పోలింగ్ నమోదయింది.
  • ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ డెహ్రాడూన్ లోని బూత్ నెంబర్ 45 లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ లో 24.14% పోలింగ్ నమోదయింది.
  • బాబా రాందేవ్ తన ఓటు హక్కును హరిద్వార్ లోని బూత్ నెంబర్ 106 లో వినియోగించుకున్నారు.
  • చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాధా కాటూరి తన ఓటు హక్కును డెహ్రాడూన్ లో వినియోగించుకున్నారు.
  • ఉదయం 9 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ లో 10.75% ఓటింగ్ జరిగింది.
  • కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తన ఓటు హక్కును రాంపూర్ నియోజక వర్గంలో వినియోగించుకున్నారు.
  • ఉత్తరప్రదేశ్ : అంరోహ నియోజక వర్గంలోని పోలింగ్ బూత్ 223 వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్దసంఖ్యలో బారులు తీరారు.  బిజెపి నుంచి డాక్టర్ కున్వేర్ సైని, కాంగ్రెస్ – ఎస్పీ అభ్యర్థిగా మెహమూద్ ఆలీ , బి.ఎస్.పి నుంచి నౌషాద్ ఆలీలు ఈ నియోజక వర్గం నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
  • ఉత్తరప్రదేశ్ : రాంపూర్ నియోజక వర్గంలోని ఓ పూలింగ్ బూత్ ను సర్వాంగ సుందరంగా అలంకరించారు.  ఈ బూత్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.
  1. ఉత్తరప్రదేశ్ : మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ షార్జాహాన్ పూర్ నియోజక వర్గంలోని డాక్టర్ సుధామ ప్రసాద్ బాల విద్యామందిర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 162 నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  2. ఉత్తరాఖండ్ : డెహ్రాడూన్ లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.  మొదటి సారి ఓటు హక్కు వచ్చిన యువత ఓటు హక్కును వినియోగించుకొని ముసిరిసిపోతున్నారు.  ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ కోరుతున్నది.
  • ఉత్తరప్రదేశ్ : సంబల్ నియోజక వర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.  AIMIM అభ్యర్థి జియర్ రెహ్మాన్ బరాక్, కాంగ్రెస్ నుంచి మహమూద్, బీజేపీ నుంచి డాక్టర్ ఆవింద్, బి.ఎస్.పి నుంచి రఫతుల్లాలు ఈ నియోజక వర్గం నుంచి బరిలో ఉన్నారు.
  • ఉత్తరాఖండ్ : డెహ్రాడూన్ లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.  హతి బర్కాలాలో ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టు తెలుస్తుంది.
  • ఉత్తరప్రదేశ్ : సంబల్ నియోజక వర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.  AIMIM అభ్యర్థి జియర్ రెహ్మాన్ బరాక్, కాంగ్రెస్ నుంచి మహమూద్, బీజేపీ నుంచి డాక్టర్ ఆవింద్, బి.ఎస్.పి నుంచి రఫతుల్లాలు ఈ నియోజక వర్గం నుంచి బరిలో ఉన్నారు.
  • ఇకపోతే, అటు ఉత్తరాఖండ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని చూస్తుంటే.. బీజేపీ ఉత్తరాఖండ్ లో తన ఉనికిని చాటుకొని అధికారాన్ని చేజిక్కించుకొనాలని చూస్తున్నది.  ఎవరికీ ప్రజలు మద్దతు పలుకుతారు అన్నది త్వరలోనే తేలిపోతుంది.
  • పోలింగ్ మెల్లగా ఊపందుకుంటుంది.  ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి రెండో దశ పోలింగ్ ఎంతో కీలకం.  ఇక్కడి 11 జిల్లాల్లో వచ్చే మెజారిటీని బట్టి సమాజ్ వాదీ భవిష్యత్తు ఉండొచ్చు.  ఇక బీజేపీ ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నది.
  • బదౌన్ సడార్ నియోజక వర్గంలోని ఎస్.కే ఇంటర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 183 లో ఈవీఎం మెషిన్ లు మొరాయించాయి.  దీంతో అక్కడ పోలింగ్ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
  • ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమయినప్పటికీ మొరాబాద్ లో ఈవీఎం మిషన్ సెటప్ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో పోలింగ్ ఆలస్యం అయింది.  దీంతో అక్కడి ఓటర్లు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.
  • ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండో దశ పోలింగ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 69 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవుతుంది కాబట్టి ప్రజలు ఉదయం నుంచే పెద్దసంఖ్యలో బారులు తీరారు.
  • ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే.. ఇటు ఒడిశా లో 29 జిల్లాల్లోని 65 బ్లాక్స్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.  అక్కడ కూడా ఈ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలయింది.

One thought on “UP and Uttarakhand Elections 2017

Leave a comment