Record Voting in Uttarakhand

పండుగలా ముగిసిన పోలింగ్ – ఆనందంలో అధికారులు 

ఎన్నికలకు ముందు కోలాహలం.. ఎన్నికల జరిగేవేళా గొడవలు.. పోలింగ్ భూత్ ల వద్ద నిరసనలు.. ఇంకులు పోయడాలు.. మిషిన్లను పగలగొట్టడాలు కనిపిస్తుంటాయి.  అయితే, ఇప్పుడు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది.  పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గోవాలో ఎప్పుడు ప్రశాంతంగానే ఎన్నికలు జరుగుతాయి.  ఎందుకంటే అక్కడ చదువుకున్న వ్యక్తులు ఎక్కువ.  అంతేకాదు.. విదేశీయుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. ప్రవర్తన నియమావళి గోవాలో సక్రమంగా ఉంటుంది.  అందుకే గోవా గురించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
ఇక పంజాబ్ విషయం తీసుకుంటే.. పంజాబ్ దేశానికీ వీర జవాన్లను ఉత్పత్తి చేసే వీరభూమి.  వీరుల గడ్డగా పేరుపొందిన పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలను తమ బాధ్యతగా తీసుకొని ప్రజలు ఓటు వేస్తారు.  మొత్తం మీద ఒకటి లేదా రెండు చోట్ల తప్పించి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు.  మొత్తమ్మీద అక్కడ కూడా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి.  గతంలో కంటే కొంత ఎక్కువ పోలింగ్ నమోదైయింది.
అయితే సమస్య అనుకున్నదల్లా ఉత్తరప్రదేశ్.  ఉత్తరప్రదేశ్ దేశంలోని పెద్ద రాష్ట్రం.  ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.  వివిధ రకాలైన ప్రజలు ఉన్నారు.  ఎన్నో వర్గాలు.. వైషమ్యాలు ఉన్నాయి.  ఇక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎన్నికల కమిషన్ దగ్గరి నుంచి పోలీస్ శాఖా అధికారుల వరకు అనేక రకాలుగా ఆలోచించారు.  అయితే, ప్రజల్లో చాలా మార్పు కనిపించింది.  గొడవపడి రచ్చచేసుకునే కంటే.. ఎవరికీ నచ్చిన అభ్యర్ధికి వారు ఓటు వేసుకుంటే సరిపోతుంది అనుకున్నారు.  ఉత్తరప్రదేశ్ లో జరిగిన రెండు దశల్లోనూ ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా ముగిసాయి.
రెండో దశలో మొత్తం 65. శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది.  రెండో దశ ఎన్నికల్లో 2.28 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఇందులో 1.04 కోట్ల మంది మహిళలు. గతంలో కంటే ఈ జిల్లాల్లో జరిగిన పోలింగ్ శాతం కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు.
ఇక ఉత్తరాఖండ్ విషయానికి వస్తే.. ఉత్తరాఖండ్ దేవభూమి.  ఇక్కడే అనేక దేవాలయాలు.. పుణ్యక్షేత్రాలు..ప్రయాగ వంటి సంగమ ప్రదేశాలు.. ఉన్నాయి.  ఎక్కువ కొండప్రాంతం కావడంతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది.  అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మధ్య ప్రధాన పోటీ జరిగింది.  ఇక్కడ 68శాతం పోలింగ్ నమోదయింది.  గతంతో పోలిస్తే ఇది హయ్యస్ట్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.  70 స్థానాలున్న ఉత్తరాఖండ్ లో 69 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మార్చి 9 న మిగిలిన ఒక్కస్థానానికి ఎన్నిక నిర్వహిస్తారు.  మరి ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం తేలాలి అంటే మార్చి 11 వరకు ఆగాల్సిందే.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s