ఓటర్ల గాలి ఎటువైపో..!

ఓటర్ల గాలి ఎటువైపో..! 
ఎలాగైతేనేం ఎటువంటి ఉద్రిక్తకరమైన సంఘటనలు చోటుచేసుకోకుండా మూడో దశ పోలింగ్ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 12 జిల్లాల్లో 69 స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.  826 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 25 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.  ఓటర్లు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంది.  సున్నితమైన ప్రాంతాలల్లో రక్షణను పగడ్బందీగా ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.   అన్నిపార్టీలు గెలుపు తమదంటే తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.  ఎవరు విజయం సాధిస్తారు అన్నది మాత్రం మార్చి 11 వ తేదీన కానీ తేలదు.
2012 లో జరిగిన ఎన్నికల్లో ఈ 69 స్థానాల్లో ఎస్పీ 54 స్థానాలు గెలుచుకుంది.  గతంలో 60% పోలింగ్ నమోదైతే.. ఈసారి రెండు శాతం పెరిగి 62% పోలింగ్ నమోదయింది.  లక్నో లోని కంటోన్మెంట్, జస్వంత్ నగర్, సరోజినీ నగర్ స్థానాలు కీలకమైనవి.  ఇక కాన్పూర్, ఏతావహ్, ఉన్నో స్థానాలు కూడా ఎస్పీకి కీలకం.  69 లో 55 స్థానాలు గెలుస్తామని ఎస్పీ ధీమాను వ్యక్తం చేస్తుంటే.. బీజేపీ, బి.ఎస్.పీలు కూడా గెలుపు తమవైపే ఉందని చెప్తున్నాయి.
కుటుంబ గొడవలకు ఎన్నికలకు సంబంధంలేదని.. ఎన్నికల్లోకి అభివృద్ధి నినాదంతో మాత్రమే వెళ్తున్నామని ఓటర్లు కూడా ఆదిశగానే ఆలోచించాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పలుమార్లు ప్రచారంలో పేర్కొన్నారు.  12 జిల్లాలో పోలింగ్ జరిగిన ప్రాంతాలు అన్ని కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలు కావడంతో ఉదయం నుంచే పోలింగ్ చురుగ్గా మొదలైంది.  వేసవికాలం కావడంతో.. సూర్యుడు తన ప్రతాపం చూపకముందే.. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొని త్వరగా వెళ్లిపోవడానికి ప్రయత్నించారు.
ఈ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ కొన్ని నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహించారు.  ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. ఎప్పుడు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే బీజేపీ, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయాన్నీ ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారం నిర్వహించింది.  ప్రధాని మోడీ నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రచారం నిర్వహించారు.  మోడీతో పాటు కేంద్రంలోని కీలక నాయకులు ప్రచారం నిర్వహించారు.
మోడీ ప్రచారంపైనే బీజేపీ ఎక్కువగా ఆధారపడి ఉంది.  మోడీ ఛరిష్మా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నెగ్గుకొస్తుందా.. గతంలో బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో మోడీ ప్రచారం నిర్వహించారు.  కానీ, అక్కడ ఎదురు గాలి వీచింది.  ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎటువంటి గాలి వీస్తుందో చూడాలి.
Advertisements

One thought on “ఓటర్ల గాలి ఎటువైపో..!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s