UP Third Phase Elections Updates

ముగిసిన మూడోదశ పోలింగ్

ఉత్తరప్రదేశ్ లో మూడోదశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  12 జిల్లాల్లో 69 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా ఎటువంటి ఉద్రిక్తకరమైన సంఘటనలు చోటు చేసుకోలేదు.  ఇక పూర్తి స్థాయిలో ఎంత పోలింగ్ జరిగింది అనే విషయం రాత్రి 7 గంటల సమయంలో ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది.

సాయంత్రం 3 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ లో 53% పోలింగ్ నమోదయింది.  పోలింగ్ ముగియడానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది.

మధ్యాహ్నం 2 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 44 % పోలింగ్ నమోదయినట్టు తెలుస్తుంది.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ లో 38.96% పోలింగ్ నమోదయింది.

ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపుల్ సెక్రటరీ నవనీత్ షెగల్ లక్నోలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎస్పీ నాయకురాలు డింపుల్ యాదవ్ సైఫాయ్ నియోజక వర్గం నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఉన్నో లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా లక్నోలోని గన్నా సంస్థాన్ పోలింగ్ బూత్ నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీప్రకాష్ జైస్వాల్ తన ఓటు హక్కును కాన్పూర్ లోని 111 నెంబర్ పోలింగ్ బూత్ లో వినియోగించుకున్నారు.

ఉన్నో లో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట, పెళ్లి తంతు పూర్తయిన వెంటనే పోలింగ్ కేంద్రానికి వెళ్లి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఉమా భారతి తన ఓటు హక్కును లక్నోలోని బూత్ నెంబర్ 149 నుంచి వినియోగించుకున్నారు. బిజెపి విజయం సాధిస్తుందనే ధీమాను ఆమె వ్యక్తం చేశారు.

మాయావతి తన ఓటు హక్కును లక్నో నుంచి వినియోగించుకున్నారు.

ఉదయం 9 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం మూడో దశ ఎన్నికల్లో 12 శాతం పోలింగ్ నమోదయింది.

బీజేపీ నేత పంకజ్ సింగ్ లక్నో లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గాలి వీస్తుందని, ఎస్పీ, బిఎస్పి లు రెండు మూడు స్థానాల కోసం పోటీ పడతాయని పేర్కొన్నారు.

రాజ్ నాథ్ సింగ్ తన ఓటు హక్కును లక్నో నియోజక వర్గం నుంచి వినియోగించుకున్నారు.

ఎన్నికల ప్రధాన అధికారి టి వెంకటేష్ తన ఓటు హక్కును లక్నోలో వినియోగించుకున్నారు.  తన కుటుంబంతో సహా వచ్చి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉత్తరప్రదేశ్ మంత్రి నితిన్ అగర్వాల్ హర్దోయ్ నియోజక వర్గం నుంచి బరిలో ఉన్నారు.  బీజేపీ నుంచి రాజా బక్స్ సింగ్, బి.ఎస్.పీ నుంచి ధరమ్ వీర్ సింగ్ లు పోటీలో ఉన్నారు.  ఇక్కడ పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తుంది.

లక్నోలో ఆకట్టుకుంటున్న మోడల్ పోలింగ్ బూత్.  ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల కమిషన్ ఇటువంటి ఏర్పాట్లు చేసింది.

లక్నోలోని మాంటిసోరి కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 253 వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు.  ఎండాకాలం కావడంతో ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్ లో మూడోదశ పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది.  ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.  ఉత్తరప్రదేశ్ లోని 12 జిల్లాల్లో 69 అసెంబ్లీ స్థానాలకు మూడో దశ ఎన్నికలు జారుతున్నాయి.  ఇందులో లక్నో నియోజక వర్గం కీలకమైన నియోజక వర్గం.  ఈ నియోజక వర్గంపైనే అందరి చూపులు ఉన్నాయి.
ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ పోలింగ్ కోసం 25  వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.  ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు పోలింగ్  కేంద్రాల వద్ద బారులు తీరారు
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s