బాలయ్య వర్సెస్ పవన్ కళ్యాణ్ @ హిందూపూర్ 

 

తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో మంచి పట్టు ఉంది.  ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పార్టీ బలంగా ఉంది.  అనంతపురం జిల్లాలోని హిందూపూర్ నియోజక వర్గం నుంచి నందమూరి బాలకృష్ణ 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.  గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హిందూపూర్ నుంచే విజయం సాధించారు.  బాలకృష్ణ కూడా అదే నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2014 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది.  దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటుంది.  పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.  గతంలో పార్టీ చేయించిన సర్వే ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కనీసం 20 నుంచి 30 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తేలింది.  ఇందులో ఎక్కువ భాగం రాయలసీమ నుంచే గెలుచుకునే అవకాశం ఉంది.
ఇక, పవన్ కళ్యాణ్ కూడా తన దృష్టిని రాయలసీమపై పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.  పార్టీని అక్కడి నుంచే బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన ప్రాంతాల్లో రాయలసీమ ఒకటి. అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి.  వాటిపై పోరాటం చేయడం మొదలుపెడితే.. రాయలసీమలో పట్టు సాధించవచ్చు అన్నది పవన్ ఆలోచన.  ఇక తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే అనంతపురం జిల్లా నుంచే పవన్ పోటీ చేస్తారని ఒక అంచనా.  అయితే, అనంతపురం జిల్లాలో ఎక్కడి నుంచి పోటీచేస్తారో మాత్రం స్పష్టంగా తెలియడంలేదు.
బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే.. ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అనుకుంటున్నట్టు సమాచారం.  ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒకే రోజు రిలీజైతే ఎటువంటి ఉత్కంఠత ఉంటుందో.. అలాంటి పండుగ వాతావరణమే అక్కడకూడా ఉంటుందని అనుకుంటున్నారు.  ఇది నిజం అవుతుందో కాదో తెలియాలంటే.. కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s