జనసేన అధ్యక్షుడు ఏపీ ఐరన్ మ్యాన్ ..?

మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పార్టీలు రెండేళ్ళ తరువాత జరిగే ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించాయి.  దేశంలో బీజేపీ ఒక్కో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటూ దూసుకుపోతుంది.  ఉత్తరాదిన సింహభాగం రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు సన్నాహాలు చేసుకుంటుంది. మోడీ, అమిత్ షా పదునైన వ్యూహాలు, వాటిని తూచా తప్పకుండా అమలు చేసే అనుచరగణం, ప్రజలలో చైతన్యం ఉండటంతో.. బీజేపీ దూసుకుపోతుంది.
దక్షిణాదిన ఇప్పటికే బీజేపీ కర్ణాటక రాష్ట్రంలో స్ట్రాంగ్ గా ఉంది.  తన సత్తాను మరోసారి చాటుకోవడానికి సన్నాహాలు చేస్తుంది.  వచ్చే ఏడాది కర్ణాటక రాష్ట్రానికి ఎన్నికలుజరగబవుతున్నాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే.. 2019 లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా దక్షిణాదిన మరింత బలపడేందుకు బీజేపీకి అవకాశం దొరికినట్టేఅవుతుంది.  ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి బలం లేదు.  ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్యనాయుడు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన కర్ణాటక నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  ఇక, రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంది.  బీజేపీ దూకుడు చూసి, తెలుగుదేశం పార్టీలో కాస్త భయం పట్టుకుంది అన్న విషయం వాస్తవం.  బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీని పుంజుకోకుండా  ఎత్తులు వేయవచ్చు.
కాగా, పొత్తు విషయం పక్కనపెడితే.. సొంతంగా పోటీ చేసి.. కనీసం 20 స్థానాలు గెలుచుకున్నా.. బీజేపీ విజయం సాధించినట్టే. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతుంది.  అయితే, పవన్ మాత్రం అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు.  అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది.  అక్కడ ఎంతవరకు పవన్ విజయం సాధిస్తారు అన్నది చర్చనీయాంశం.  బీజేపీ బలంపెంచుకోవడం… తెలుగుదేశం పార్టీ బలహీనపడకుండా ఉండటం కోసం ఎత్తులు వేస్తుండటం.. అటు వైకాపా తన ఉనికిని చాటుకునేందుకు పధకాలు రచించడం.. కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా.. అధికారపక్షంపై విమర్శలు చేస్తూ.. దానిబలాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం చేస్తున్నాయి.  మరి పవన్ ఎలాంటి పథకాలు వేస్తున్నారో తెలియదు.  ఆ పార్టీ ఇంతవరకు తన కార్యాచరణను ప్రకటించలేదు.  16 సంవత్సరాల పాటు నిరాహార దీక్ష చేసి మణిపూర్ ఐరన్ లేడిగా పేరు తెచ్చుకున్న ఇరోమ్ షర్మిలా పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తే ఏం జరిగిందో చూశాం కదా.  ఇక్కడ పవన్ పరిస్థితి అలా కాకుండా ఉంటె బెటర్.  చూద్దాం ఏం జరుగుతుందో.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s