Janasena Party new Alliance in Telangana

తెలంగాణ… 2014 జూన్ 2 వ తేదీన అధికారికంగా ఏర్పడిన కొత్త తెలుగు రాష్ట్రం.  తెలంగాణ రాష్ట్ర  సాధన కోసం గత ఆరు దశాబ్దాలుగా పోరాటాలు జరిగాయి.  ఎలాగైతేనేం కొత్త రాష్ట్రం ఏర్పాటు జరిగింది.  తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది.
2014 లో జరిగిన జరిగిన ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించింది.  అదే జనసేన.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పార్టీని స్థాపించిన సంగతి విదితమే.  అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు.  కానీ, ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పవన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయక తప్పడంలేదు.  2019 ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.  ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.
ఈ ప్రకటన తరువాత అనేక కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తారు.  అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ తీవ్రంగా శ్రమిస్తారు.  ఈ సంగతి తెలిసిందే.  అయితే, మరి తెలంగాణ పరిస్థితి ఏమిటి.. ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారు.  ఎవరికీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారు అనే విషయంపై క్లారిటీ రావడంలేదు.
తెలంగాణ పోరాటంలో సాహితీవేత్తలు కీలక పాత్ర వహించారు.  వారి పాటలతో చాలామందిని ఆకట్టుకున్నారు. ఉద్యమానికి ప్రాణంపోసి జీవం తెచ్చిన వారు సాహితీవేత్తలు అనడంలో సందేహం లేదు.  ఇందులో గద్దర్ ముందు వరసలో ఉంటారు.  గద్దర్ ను జనసేనలోకి తీసుకొచ్చేనందుకు ఏర్పాట్లు మమ్మురంగా సాగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి.  గద్దర్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీ మరింతగా బలోపేతం అవుతుందనే కొందరి సలహా మేరకు జనసేన ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  మరి ఎంతవరకు నిజం అన్నది స్పష్టంగా తెలియదు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s