Know about Modi and Yogi

Modi and Yogi

మోడీ, యోగిల గురించి మీకేం తెలుసు..?

భారత ప్రధాని మోడీ ఎంత మందిని ప్రభావితం చేసారో లెక్కలేదు.  మోడీ తన వాక్చాతుర్యంతో.. తనదైన ఛలోక్తులతో అందరిని ఆకట్టుకుంటున్నారు.  పని విషయంలో కూడా మోడీ అంతే దూకుడుగా ఉంటున్నాడు.  ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.  భారత ప్రధానిగా మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే అందుకు ఉదాహరణ.  వ్యక్తికన్నా దేశం మిన్నా అనే నినాదంతో ముందుకుపోతున్న మోడీకి దేశంలోని యావత్ ప్రజలు మద్దతు ఇస్తున్నారు.
ఇక మోడీ తరువాత దేశంలో అంతటి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అంటే యోగి ఆదిత్యానాథ్.  ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో యోగి పార్టీ కోసం చేసిన కృషి అమోఘమైంది.  అంతేకాదు, ఒకవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూనే.. మరోవైపు పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు.  ఇకపోతే, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది అంటే అందుకు ప్రధాన కారణం యోగి అనే చెప్పాలి.  ఇటు రాష్ట్రంలో ఉన్న సమస్యలను .. పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, అటు పార్టీ గెలవాలంటే చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కేంద్రంతో సమన్వయం చేసుకొని పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్రను పోషించారు యోగి.  ఒకానొక దశలో మోడీ తరువాత బీజేపీని, దేశాన్ని నడిపించగల సమర్ధుడు యోగినే అని వార్తలు కూడా వినిపించాయి.  వచ్చే ఎన్నికల్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.  అటు యూపీలో సంపూర్ణ మెజారిటీ సాధించిన బీజేపీ.. అంతే సంపూర్ణంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. శభాష్ అనిపించుకుంటున్నది.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s