How BJP stong in South States

bjp

బీజేపీకి అసలైన పరీక్ష..

వెంకయ్య క్రియాశీల రాజకీయాల్లో లేకపోవడం బీజేపీకి లాభమా.. నష్టమా.. ?
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏమిటి.. ?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కటి కాబోతున్నారా..?
ఇద్దరు కలిసి సమస్యలపై పోరాటం చేస్తే.. కేంద్రం దిగివస్తుందా..?
బీజేపీ అసలైన పరీక్షను ఎదుర్కోబోతోంది.  ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ.. ఇటు దక్షిణాదిన బలపడేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.  దక్షిణాదిన బలపడాలి అంటే.. దానికి తగిన అవకాశాలను సృష్టించుకోవాలి.  ప్రజల్లోకి దూసుకెళ్లగలిగే సత్తా ఉన్న మాస్ లీడర్ కావాలి.  అలాంటి మాస్ లీడర్ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎవరు ఉన్నారు.  ఉత్తరాది రాజకీయాలు వేరు.. దక్షిణాది రాజకీయాలు వేరు.  ఉత్తరాదిన బీజేపీ పవనాలు బలంగా వీస్తున్నాయి.  దేశంలో బీజేపీ బలపడటానికి 30 సంవత్సరాలు పట్టింది.  క్షేత్రస్థాయి నుంచి పునాదులు వేసుకుంటూ వచ్చింది కాబట్టే ఇప్పుడు ఉత్తరాదిన నిలబడింది.
కానీ ఈ పరిస్థితి దక్షిణాదిలో లేదు.  దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి.  130 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీనే గత ఎన్నికల్లో దక్షిణాదిన తుడిచిపెట్టుకుపోయింది.  మరి ఇప్పుడు బీజేపీ ఎంతవరకు నెట్టుకు రాగలదు అన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు.  ఈ రెండు రాష్ట్రాల్లోని ఓటర్ల నాడి గురించి ముందుగా తెలుసుకోవాలి.  తరతరాల నుంచి ఇక్కడి ఓటర్లు ఓ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుంటారు.  వారికే ఓటు వేస్తుంటారు.  ముందు వారిని మార్చగలగాలి.  తమకు అధికారం ఇస్తే.. అభివృద్ధి చేస్తామనే నమ్మకం కలిగించాలి.  వారిని మార్చగలిగే నాయకులు ఇప్పుడు చాలా అవసరం. బీజేపీలో క్లాస్ లీడర్లు ఉన్నారు కానీ, మాస్ లీడర్లు లేరు.  పట్టణాల్లోని ప్రజలు కొంతవరకు బీజేపీ సపోర్ట్ చేస్తారు.  మరి పల్లెల పరిస్థితి ఏమిటి.. బీజేపీ ఉందని వారికి తెలుసా.. బీజేపీ లీడర్లు ఎవరో వారికి తెలుసా.. పార్టీ వారికి చేరువ కావాలి అంటే ఏం చేయాలి.  బీజేపీ అధిష్ఠానం దీని గురించే మొదట ఆలోచించాలి.  ఎందుకంటే.. పట్టణాల్లో ఎన్ని ఓట్లు వచ్చినా.. పార్టీల రాత మార్చేది మాత్రం పల్లెలే.  కాబట్టి వీరికి చేరువ కావడం ముఖ్యం.
ఇక ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద తలకాయగా ఉన్న వెంకయ్య నాయుడు క్రియాశీల రాజకీయాల నుంచి పక్కకు వెళ్తున్నారు.  ఉపరాష్ట్రపతిగా ఆయన ఎంపిక కాబోతున్నారు.  తెలుగు రాష్టాల్లో బీజేపీ అంటే వెంకయ్య నాయుడే గుర్తుకు వస్తారు. ఆయన లేకపోవడం తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీకి లాభమా లేక నష్టమా.. వెంకయ్య నాయుడు లేకపోయినా.. బీజేపీని క్షేత్రస్థాయిలో బలపడేవిధంగా చేయగలిగే సత్తా తమ వద్ద ఉందని వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం చేస్తామని కొందరు నాయకులు చెప్తున్నారు.  ఇక తెలుగు రాష్టాల్లోని సమస్యలను కేంద్రం వద్దకు తీసుకెళ్లడం.. కేంద్రంతో చర్చించడం.. వాటిని పరిష్కరించడంలో తనదైన శైలిని కనబరిచిన వెంకయ్యనాయుడు… క్రియాశీల రాజకీయాల పక్కకు తప్పుకుంటున్న సమయంలో అంతటి చతురతను ప్రదర్శించి కేంద్రంతో సమన్వయం చేయగలిగే వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్ మాధవ్ కేంద్ర రాజీకీయాల్లో చురుగ్గా ఉన్నారు.  ఇటు తెలంగాణా నుంచి మురళీధర రావు గారు కూడా కేంద్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.  రెండు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు వీరి సేవలను ఉపయోగించుకోవాలి.  కేంద్ర స్థాయిలో పనిచేసిన అనుభవం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల నాడి తెలిసిన వ్యక్తులు.  రాష్ట్రంలోని నాయకులను, ప్రజలతో సమన్వయం చేసేవిధంగా వీరు విధివిధానాలు రూపొందించాలి.  అప్పుడే క్షేత్రస్థాయిలో బీజేపీ బలం పెరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే బీజేపీ బలంగా ఉంది.  ఈ విషయం జగమెరిగిన సత్యం.  తెలంగాణలో బలాన్ని మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు సృష్టించుకోవాలి.. అటు ఆంధ్రప్రదేశ్ లో క్షేత్రస్థాయిలో బలపడేందుకు బీజేపీ నాయకులు కృషి చేయాలి.  అంతర్గత కలహాలు, విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పునాదులు నిర్మిస్తేనే..ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి భవిష్యత్తు ఉంటుంది.  లేదంటే ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారిపోతుంది.
ఇక వెంకయ్యనాయుడు పక్కకు తప్పుకుంటున్నారు కాబట్టి రాష్ట్రంలోని సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకుంటున్నారని సమాచారం.  రెండు రాష్ట్రాల సమస్యల పై ఇప్పటి వరకు వేరువేరుగా కేంద్రం దగ్గరికి వెళ్లేవారు.  వెంకయ్యనాయుడు సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించేవారు.  అయితే, ఇప్పుడు పరిస్థితి వేరు.  కాబట్టి తెలుగు రాష్ట్రాల సమస్యలపై ఇరు రాష్ట్రాలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని చూస్తున్నాయి.  ఇలా కలిసికట్టుగా ఒత్తిడి తెస్తే.. కేంద్రం దిగివస్తోందనే ఆలోచనలో ఉన్నారు.  ఇదే జరిగితే.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కొంత దెబ్బ తగలవచ్చు.  కేటీఆర్ పుట్టినరోజునాడు లోకేష్ శుభాకాంక్షలు చెప్పడం..రెండు రాష్ట్రాలు సమస్యపై కలిసికట్టుగా పోరాటం చేయాలని కేటీఆర్ పిలుపునివ్వడం వంటివి చూస్తుంటే.. ఇకపై రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలని అనుకుంటున్నాయని తెలుస్తోంది.  ఉత్తరాదిన తన బలాన్ని నిరూపించుకొన్న బీజేపీ.. దక్షిణాదిన బలపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూడాలి.  ఇప్పుడిది బీజేపీకి నిజంగా పరీక్షాకాలమే.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s