Match fixing.. Shane warne sensational allegations

షేన్‌ వార్న్‌ సంచలన ఆరోపణలు.. ఫిక్సింగ్. కొన్నేళ్లుగా క్రికెట్ ని వణికిస్తోన్న భూతం. ఇప్పుడిది మరోసారి వార్తల్లోకొచ్చింది. తన క్రికెట్‌ కెరీర్‌లో ప్రత్యర్థి జట్టు క్రికెటర్‌ ఒకరు భారీ మొత్తం లంచం ఇవ్వడానికి యత్నించారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ ఆరోపించాడు. పాకిస్తాన్‌తో కరాచీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సలీం మాలిక్‌ లంచాన్ని ఆఫర్ చేసినట్లు చెప్పాడు. తాను ఆఫ్‌ స్టంప్‌ అవతల బంతులు వేస్తే దాదాపు రెండు లక్షల యూఎస్‌ డాలర్లు ఇస్తానని మాలిక్‌ ఆఫర్‌ చేశాడని వార్న్‌ చెప్పాడు. అలాగే.. శ్రీలంకకు చెందిన ఓ బుకీ కూడా తనకు డబ్బులను ఆశచూపించి ఫిక్సింగ్‌ చేయించాలని చూశాడని ఆరోపించాడు. Advertisements Continue reading Match fixing.. Shane warne sensational allegations

No one can stop Janasena says Pawankalyan

జనసేనను ఎవరూ అడ్డుకోలేరు.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దూకుడు పెంచారు. అధికార టీడీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. జనసేన నాయకులపై దాడులు చేసేవారిని, రౌడీ ఎమ్మెల్యేలను వెనుకేసుకొస్తే మట్టికొట్టుకుపోతారని విమర్శించారు. ‘మీ ముఖ్యమంత్రే నా దగ్గరికి వచ్చారు. ముఖ్యమంత్రిని ఒక్కటే అడుగుతున్నా.. జనసేన బలపడకూడదా? ప్రజాస్వామ్యం టీడీపీ సొత్తా..? అని ప్రశ్నించారు. జనసేన ఎదుగుదలను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. దేవరాపల్లిలో పవన్‌ మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామస్థాయిలో జనసేన మరింత బలపడుతుందన్నారు. మాదిగల్లో పెద్దమాదిగనని చెప్పుకునే చంద్రబాబుకి ఆయన ఎమ్మెల్యేలు కులాలవారిగా తిడుతూ దాడులు చేస్తుంటే కనిపించడం లేదా అని జనసేనాని ప్రశ్నించారు. టీడీపీని ప్రశ్నించగానే తన కులం గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు Continue reading No one can stop Janasena says Pawankalyan

Will Janasana contest in Telangana?

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా?తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతారా? ఏపీతోపాటు పక్క రాష్ట్రంలోనూ జనసేన సత్తా చాటుతుందా? అధినేత పవన్‌ కల్యాణ్‌ మనసులో ఏముందోగానీ.. కార్యకర్తలు మాత్రం తెలంగాణలోనూ పోటీ చేయాల్సిందేనని అన్నారు. పవన్‌ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. బలం ఉన్న చోటే కాదు.. బలహీనంగా ఉన్న చోట కూడా పోటీకి నిలవాలని.. తెలంగాణకు పవన్‌ కల్యాణ్ వంటి నిజాయితీపరుడి అవసరం ఉందని కార్యకర్తలు అంటున్నారు. జనసేన తెలంగాణ నేతలు కూడా 30 నుంచి 40 స్థానాల్లో పోటీ చేయాలని పవన్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న జరగనున్న భేటీ కీలకంగా మారనున్నది. తెలంగాణలో పోటీ చేయాలా… వద్దా అనే అంశంపై నేతలలో పవన్‌ చర్చించనున్నారు. దీంతో.. తెలంగాణలో పోటీ విషయమై 16వ తేదీన క్లారిటీ రావచ్చొని చెప్పవచ్చు. Continue reading Will Janasana contest in Telangana?

Times Now pre poll survey shocks BJP

బీజేపీకి అధికారం దూరం..రాజస్థాన్‌లో బీజేపీ పీఠం కదలబోతోందా? కాంగ్రెస్‌కు అధికారం అందనున్నదా? అంటే అవుననే చెబుతోంది ‘టైమ్స్ నౌ’ ప్రీ-ఎలక్షన్ సర్వే. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ 75 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని ఈ సర్వే తేల్చింది. 2013లో బీజేపీకి 163 స్థానాలు దక్కాయి. కానీ.. ఇప్పుడు అంత సీన్‌ లేదని.. 75 స్థానాలతో ఆ పార్టీ రెండో స్థానానికి పరిమితమవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. 115 సీట్లతో సంపూర్ణ మెజారిటీ కంటే ఎక్కువ సీట్లే కాంగ్రెస్‌ సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందని ఈ సర్వే చెబుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ సర్వే ఏమేరకు నిజమవుతుందో చూద్దాం.. Continue reading Times Now pre poll survey shocks BJP

Top Leaders on same dias after 24 years 

మళ్లీ కలిసిన గురు శిష్యులు..గురుశిష్యులు ఒకటయ్యారు. మహాకూటమి పుణ్యమాని 24 ఏళ్ల తర్వాత కలిసి పని చేయబోతున్నారు. ఎవరా గురుశిష్యులు? ఎమిటా కథ? తెలుసుకోవాలనుందా..? వారే కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ. 1981లో మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైన జీవన్‌రెడ్డి 1983లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985 సంక్షోభం సమయంలో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో వై.ఎస్‌. మంత్రి వర్గంలో మంత్రిగానూ పనిచేశారు. ఇక.. జీవన్‌రెడ్డికి శిష్యుడిగా అరంగేట్రం చేసిన రమణ.. 1994లో టీడీపీ తరఫున పోటీ చేసి.. గురువు జీవన్‌రెడ్డినే ఓడించి.. ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. ఐతే.. 1999 నుంచి 5 ఎన్నికల్లో జీవన్‌రెడ్డిపైనే పోటీ చేసి కేవలం ఒక్కసారే గెలుపొందారు. 24 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం ఒక్కటయ్యారు. నిన్న ఇద్దరూ కలిసి ప్రెస్‌ మీట్‌ పెట్టారు. … Continue reading Top Leaders on same dias after 24 years 

Kodandaram deadline to Congress Party

కాంగ్రెస్‌కు కోదండ డెడ్‌లైన్ ‌తెలంగాణలో మహాకూటమిలో విబేధాలు మొదలయ్యాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్‌కు తెలంగాణ జనసమితి పార్టీ షాక్‌ ఇచ్చింది. సీట్ల సర్దుబాటుపై 48 గంటల డెడ్‌ లైన్ విధించింది. 48 గంటల తర్వాత కూడా ఇంకా జాప్యం జరిగితే 22 మంది అభ్యర్థులతో తమ తొలి జాబితా విడుదల చేస్తామని టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ స్పషం చేశారు. తాము కోరినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని టీజేఎస్ పట్టుబడుతున్నట్టు తెలిసింది. లేని పక్షంలో భావసారూప్యత కల్గిన పార్టీలతో ముందుకెళ్తానని అల్టిమేటం జారీ చేశారు. తాము కోరుకున్న సీట్లు ఇవ్వాల్సిందేనని, లేకపోతే కలిసొచ్చే పక్షాలతో ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లో 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కూడా ప్రకటించాస్తానని కోదండరామ్‌ అన్నట్టు తెలిసింది. Continue reading Kodandaram deadline to Congress Party

Lokesh cant win even as Sarpanch

లోకేష్‌కు పవన్‌ కౌంటర్‌.. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి లోకేష్‌ను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఎద్దేవా చేశారు. కనీసం సర్పంచ్‌గా కూడా లోకేష్ గెలవలేరని విమర్శచారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే జనసేన బలోపేతం అవుతుందని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. తాము బలోపేతమైతే ఓటమి ఖాయమని టీడీపీకి తెలుసన్నారు. ఇక.. వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేనిని ప్రభాకర్‌ను తొలగించకపోతే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాస్తానని పవన్‌ హెచ్చరించారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే తన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. Continue reading Lokesh cant win even as Sarpanch