రామ్ చరణ్ … ఎన్టీఆర్ లు ప్రచారానికి సిద్ధం..?

వినయ విధేయ రామ తరువాత రామ్ చరణ్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.  ఈ ఏడాది మొత్తం ఈ సినిమా షూటింగ్ లోనే పాల్గొంటాడు రామ్ చరణ్.  అటు అరవింద సమేత తరువాత ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ ఆ సినిమాపైనే దృష్టి సారించారు.  ఈ మల్టీ స్టారర్ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటె, ఇటీవలే జరిగిన వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సమయంలో రామ్ చరణ్ జనసేన గురించి మాట్లాడారు.  చిన్న టీ గ్లాస్ పెద్ద సంచలనం సృష్టించడం ఖాయం అని చెప్పడం.. చరణ్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని కేటీఆర్ చెప్పడం చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ తరపున ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  ఒక్క చిన్న ఫోన్ చేస్తే చాలు.. ప్రచారం చేస్తానని చరణ్ చెప్పడం చూస్తుంటే ఇది ఖాయం అనిపిస్తోంది.
మరోవైపు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఏర్పడింది.  ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కొంతవరకు బలహీనపడింది.  గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసిన కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జట్టుకట్టడంతో పార్టీకి కొంతమేర నష్టం జరిగింది.  ఈ నష్టాన్ని భర్తీ చేసి, కొంతవరకు తిరిగి పుంజుకోవాలంటే ఛరిష్మా కలిగిన వ్యక్తి అవసరం ఉంది.  దీంతో టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారం కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది.  మరి జూనియర్ దీనికి ఒప్పుకుంటాడా చూడాలి.

Leave a comment